తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విడుదలకు నోచుకోని సల్మాన్ 14 సినిమాలు - సల్మాన్ ఖాన్ రిలీజ్ కానీ సినిమాలు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఓ లెక్కుంది. అతడి చిత్రం అంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అయితే ఇతడు నటించిన దాదాపు 14 సినిమాలు కొన్ని విడుదలకు నోచుకోలేదు. ఇంతకీ అవేంటి?

విడుదలకు నోచుకోని సల్మాన్ సినిమాలు ఇవే!
విడుదలకు నోచుకోని సల్మాన్ సినిమాలు ఇవే!

By

Published : Jul 12, 2020, 7:21 PM IST

Updated : Jul 12, 2020, 9:54 PM IST

బాలీవుడ్​లో కండలవీరుడిగా పేరు తెచ్చుకున్నాడు సల్మాన్ ఖాన్. కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించగలడని నిరూపించుకున్నాడు. భాయ్ సినిమా ఎప్పుడూ నిరాశ కలిగించదని ఫ్యాన్స్ అభిప్రాయపడేలా వారి మనసుల్లో స్థానం సంపాదించాడు. అందుకే ప్రస్తుతం అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. చాలా మందికి తెలియని విషయమేంటంటే.. ఇతడు నటించిన 14 సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. రకరకాల కారణాలతో అవన్నీ చిత్రీకరణలకే పరిమితమయ్యాయి. అందులో టాప్-10 ఇవే.

భాగ్యశ్రీకి పెళ్లి.. ఆగిపోయిన 'రణ్​క్షేత్ర'

సల్మాన్ ఖాన్, భాగ్య శ్రీ కలిసి నటించిన 'మైనే ప్యార్ కియా' ఘనవిజయం సాధించింది. తర్వాత మరో సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. దాని పేరే రణ్​క్షేత్ర. అయితే భాగ్య శ్రీకి పెళ్లికావడం వల్ల ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. తర్వాత వీరిద్దరినీ మళ్లీ తెరపై చూడలేకపోయారు అభిమానులు.

విడుదలకు నోచుకోని సల్మాన్ సినిమాలు ఇవే!

దిల్ హై తుమ్హారా

సల్మాన్ ఖాన్, సన్నీ దేఓల్, మీనాక్షి శేషాద్రి కలిసి నటించిన చిత్రం దిల్హ్​ హై తుమ్హారా. 1991లో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఓ దశ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కానీ దర్శకుడు రాజ్​కుమార్ సంతోషి బాబ దేఓల్​తో మరో సినిమా ఒప్పుకోవడం వల్ల ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ మొదలు కాలేదు.

ఘేరావ్​

సల్మాన్​తో 'దిల్​ హై తుమ్హారా' ఆగిపోయిన కారణంగా ఈ కథానాయకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు రాజ్​కుమార్ సంతోషి. ఆ సినిమే ఘేరావ్. ఇందులో మనీషా కోయిరాలా హీరోయిన్. కానీ మొదటి దశ చిత్రీకరణ జరుపుకోకుండానే ఆగిపోయింది.

విడుదలకు నోచుకోని సల్మాన్ సినిమాలు ఇవే!

ఆయే మేరా దోస్త్

1996 కంటే ముందే ఈ సినిమా విడుదల కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాలతో నిలిచిపోయింది. సల్మాన్​తో పాటు దివ్య భారతి, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇందులోని పాటలను సల్మాన్ నటించిన 'మజ్ధార్'​ కోసం ఉపయోగించారు.

విడుదలకు నోచుకోని సల్మాన్ సినిమాలు ఇవే!

బులంద్

ఈ చిత్రంలో సల్మాన్ సరసన సోమీ అలీ నటించింది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ రద్దయింది.

విడుదలకు నోచుకోని సల్మాన్ సినిమాలు ఇవే!

దస్

ముకుల్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'దస్' సినిమాలో సల్మాన్​తో పాటు సంజయ్ దత్, రవీనా ఠాండన్, శిల్పా శెట్టి నటించాల్సి ఉంది. కానీ ముకుల్ గుండెపోటుతో మరణించడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇదే టైటిల్​తో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో 2005లో ఓ చిత్రం విడుదలైంది. ఇందులో సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలకపాత్రలు పోషించారు.

ఇవే కాకుండా సల్మాన్ కెరీర్​లో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలు ఇవే

  • రామ్​-సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, పూజా భట్ ప్రధాన పాత్రలు
  • చోరీ మేరా కామ్ - సల్మాన్​తో పాటు సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, కాజోల్​ ముఖ్య పాత్రలు
  • రాజు రాజా రామ్ - సల్మాన్, గోవింద, జాకీ ష్రాఫ్
  • ఆంఖ్ మిచోలీ - ఇందులో సల్మాన్ ద్విపాత్రాభినయం చేయాల్సి ఉండేది
  • జల్వా - ఇందులో సల్మాన్​తో పాటు సంజయ్ దత్, ఆర్మాన్ కోహ్లీ కీలక పాత్రలు
  • సాగర్ సే గేహ్రా ప్యార్ - సల్మాన్ ఖాన్, రవీనా ఠాండన్
  • హ్యాండ్​సమ్ - సల్మాన్​, సంగీత బిజ్లానీ, నగ్మ
  • నో ఎంట్రీ మేన్ ఎంట్రీ - ఇది నో ఎంట్రీకి సీక్వెల్​గా తెరకెక్కాల్సింది. అనీష్ భజ్మీ దర్శకత్వంలో రూపొందాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు.
Last Updated : Jul 12, 2020, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details