తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పుషప్‌లు చేస్తూ 81వ పుట్టినరోజు చేసుకున్న బామ్మ! - పుషప్‌లు చేస్తూ 81వ పుట్టినరోజు చేసుకున్న బామ్మ!

సాధారణంగా ఇంట్లో 81 ఏళ్లు ఉన్నవారి పుట్టిన రోజు తమ పిల్లలు, మనుమలతో జరుపుకుంటారు. మిలింద్‌ సోమన్‌ తల్లి ఉషా సోమన్‌ మాత్రం పుషప్ చేస్తూ ఆరోగ్య స్పృహతో బెల్లంతో తయారుచేసిన కేక్ కట్ చేసి జరుపుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యాయమం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేందుకు ఇలా చేసినట్లు ఆమె తెలిపారు.

milind soman mother celebrate 81 birthday by doing pushups
తల్లి ఉషా సోమన్ తో మిలింద్ సోమన్

By

Published : Aug 4, 2020, 8:42 AM IST

ఎనభైఒకటో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎవరైనా ఏంచేస్తారు.. తమ పిల్లలు, మనమలతో కలిసి సంతోషంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటారు. కానీ మిలింద్‌ సోమన్‌ తల్లి ఉషా సోమన్‌ మాత్రం విభిన్నంగా పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పుషప్‌లు చేసి ఫిట్‌నెస్‌ ప్రియులను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తారు. అలాగే ఆరోగ్య స్పృహతో బెల్లంతో తయారుచేసిన వెనిల్లా, బాదంకేక్‌ను కట్‌చేశారు. కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం పోరాటం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందనే విషయాన్ని ఇలా చెప్పారు.

అనుక్షణం కుటుంబం కోసం పరితపించే ఎంతోమంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే అందరిలో వ్యాయామ స్ఫూర్తిని నింపేందుకు తల్లి చేస్తోన్న వ్యాయామాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటారు మిలింద్‌ సోమన్‌. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన ఎనభైఒకటో పుట్టినరోజు సందర్భంగా జాంబియాలో బంగీజంప్‌ చేయాలని నిర్ణయించుకున్నారట ఉష. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే పుట్టినరోజు జరుపుకోవాల్సి వచ్చిందట. అలాగే కొడుకుతో కలిసి ఉష తాడాట ఆడిన వీడియోకు విశేష స్పందన లభించింది. ఇంతకుముందు కోడలు అంకితతో కలిసి ఒంటికాలి మీద నడిచిన ఉష.. కోడలి కంటే వేగంగా నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ABOUT THE AUTHOR

...view details