ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్. ఒకే నెలలో కోట్లమంది యూజర్లు ఆ మాధ్యమంలో లాగిన్ అవుతున్నారు. రోజుకు కొన్ని గంటలపాటు వీడియోలను చూసేస్తున్నారు. దాదాపుగా 40 శాతం ఇంటర్నెట్ వినియోగం యూట్యూబ్‌తోనే జరుగుతుందని చెప్పినా ఆశ్చర్యం లేదు. అయితే ఈ సామాజిక మాధ్యమంలో ప్రీమియంతో పాటు కొన్ని వీడియోలను డౌన్లోడ్ చేసుకునే వీలుండదు. అయితే అలాంటి వీడియోలను మరో యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
'న్యూపైప్' అనే యాప్‌తో..
యూట్యూబ్ వీడియోలను డౌన్లోడ్ చేసుకునేందుకు ప్లేస్టోర్‌లో ఇప్పుడు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికోసం నెటిజన్లకు అందుబాటులో ఉన్న పారదర్శక యాప్‌లలో న్యూపైప్ ఒకటి. అందులో ప్రకటనలు, సిఫారసులు ఉండవు. యూట్యూబ్ ప్రీమియం ఖాతా లేకుండానే దానికి సంబంధించిన వీడియోలను చూసేయొచ్చు. దాంతో పాటు 1080పిక్సెల్స్, 2కే, 4కే నాణ్యత కలిగిన వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కలదు. వీటితో పాటు సబ్‌టైటిల్స్, ప్లేలిస్ట్స్ ఎంచుకునే సౌకర్యం కూడా ఉంది.