Youtube Shorts Google Play Store Ads :విశేషమైన జనాదరణను సొంతం చేసుకుంటున్న యూట్యూబ్‌లోని ప్రముఖ సెగ్మెంట్ 'షార్ట్స్' త్వరలోనే గూగుల్ ప్లే-స్టోర్‌లో కనిపించనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే గూగుల్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ వెల్లడించింది. ఈ షార్ట్ వీడియోస్ కేవలం కంపెనీల ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ అని పేర్కొంది. ఇప్పటికే ప్లే-స్టోర్‌లో యాడ్ల రూపంలో అనేక ప్రమోషన్ వీడియోస్ కనిపిస్తుంటాయి. ఇక వీటికి అదనంగా ప్రమోషన్స్‌కు సంబంధించిన యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ కూడా మున్ముందు ప్లే-స్టోర్‌లో దర్శనమివ్వనున్నాయి.
ముందు ఆ దేశంలో ట్రయల్ రన్..
Youtube Shorts Google Play :YouTube Shorts సిరీస్‌లో భాగంగా ఇప్పటికే దీనిని పైలట్ ప్రాజెక్ట్ కింద అమెరికాలో ప్రవేశపెట్టి పరీక్షిస్తున్నారు. ఒకవేళ అక్కడ సానుకూల ఫలితాలు సాధిస్తే.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమోషన్స్ షార్ట్స్ వీడియోస్‌ను అందరికీ పరిచయం చేయనున్నారు. ఈ యాప్ పేరును 'ది ప్లే రిపోర్ట్' అని తెలుస్తోంది. యూజర్స్ కొత్తగా వచ్చే యాప్‌లను కనుగొనడమే కాకుండా.. డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ షార్ట్ వీడియోస్‌ను భవిష్యత్‌లో ఎడిటోరియల్ కంటెంట్‌లో యాడ్ చేయనున్నారు.
Youtube Shorts Play Store : అత్యుత్తమ రేటింగ్ కలిగిన సంస్థలకు సంబంధించిన యాప్‌లను మాత్రమే గూగుల్.. మన ప్లే-స్టోర్‌లో చూపిస్తుంటుంది. ఇందులో మంథ్లీ పిక్స్, న్యా ఆన్ ప్లే, టీచర్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్‌తో పాటు గేమ్స్, ఫుడ్ రెసిపీస్ యాప్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, హెల్త్ యాప్స్ సహా గూగులర్స్, యూట్యూబర్స్కు సంబంధించిన అనేక రకాల యాప్స్‌ను కూడా మనం సజ్జస్టెడ్ యాప్స్ కేటగిరీలో చూడవచ్చు. ఇక త్వరలోనే గూగుల్ తీసుకురానున్న ఈ నూతన షార్ట్ వీడియోస్(యాడ్స్) ఫీచర్‌ను కూడా టాప్ లిస్ట్‌లో వీక్షించొచ్చు.