తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫేక్ థంబ్​నెయిల్స్​కు చెక్.. యూట్యూబ్​ నుంచి అదిరే ఫీచర్!

YouTube new features: యూజర్స్​ను మభ్యపెట్టి వ్యూస్ రాబట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు కొందరు యూట్యూబర్స్. వీడియోలో ఏదో ఉంటే.. థంబ్​నెయిల్స్​పై మాత్రం మరేదో పెడుతుంటారు. విసుగు తెప్పించే ఈ యూట్యూబ్ థంబ్​నెయిల్స్​ గోలకు త్వరలో అడ్డుకట్టపడనుంది! ఈ మేరకు యూట్యూబ్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదేంటంటే?

By

Published : May 20, 2022, 7:47 AM IST

YOUTUBE THUMBNAIL new feature
YOUTUBE THUMBNAIL new feature

YouTube new features: యూజర్లను ఆకట్టుకునేందుకు యూట్యూబర్లు తమ వీడియోలకు ఆసక్తికరమైన థంబ్‌నెయిల్స్ పెడుతుంటారు. ముఖ్యమైన సమాచారం కోసమని క్లిక్ చేస్తే.. అందులోని కంటెంట్ విసుగు తెప్పిస్తుంది. వీడియో మొత్తంలో ముఖ్యమైన సమాచారం ఉండేది పది నుంచి 30 సెకన్లయితే.. వీడియో నిడివి ఎక్కువ ఉండటంతో వాటిని చూడటం మధ్యలోనే ఆపేస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. 'మోస్ట్‌ రీప్లేడ్' పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ సాయంతో మీరు చూడాలనుకుంటున్న వీడియోలో ఏ భాగాన్ని యూజర్లు ఎక్కువసార్లు చూసారనేది చూపిస్తుంది. దాంతో యూజర్లు మొత్తం వీడియో చూడకుండా మోస్ట్‌ రీప్లేడ్‌ను మాత్రమే చూడవచ్చు. దాంతో యూజర్ల సమయంతో పాటు, డేటా కూడా ఆదా అవుతుంది.

Most Replayed YouTube: ఇప్పటి వరకు మోస్ట్‌ రీప్లేడ్ ఫీచర్‌ యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా ఈ ఫీచర్‌ను సాధారణ యూజర్లకు డెస్క్‌టాప్‌, మొబైల్‌ వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. యూజర్లకు వీడియోలోని మోస్ట్‌ రీప్లేడ్ పార్ట్ తెలిసేలా వీడియో పక్కన ప్రొగ్రెసివ్‌ బార్‌ గ్రాఫ్‌ ఉంటుంది. అందులో యూజర్లు ఎక్కువగా చూసిన వీడియో నిడివి వద్ద బార్‌ గ్రాఫ్ పెద్దదిగా కనిపిస్తుంది. దాంతో యూజర్లు సులువుగా వీడియోలో మోస్ట్ రీప్లేడ్ కంటెంట్‌ను చూడొచ్చు.

Video Chapters, Single Loop YouTube: దీనితో పాటు మరికొన్ని అప్‌డేట్‌లు, ఫీచర్లను యూట్యూబ్‌ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో కొన్ని కొత్తవి కాగా, మరికొన్నింటిని అన్ని డివైజ్‌లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీడియోలను సబ్‌-సెక్షన్స్‌గా విభజించేందుకు మే 2020లో యూట్యూబ్‌ వీడియోస్ ఛాప్టర్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు వీడియోలోని తమకు నచ్చిన పార్ట్‌ను ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్‌ డెస్క్‌టాప్‌, మొబైల్ డివైజ్‌లకు మాత్రమే పరిమితం కాగా, తాజాగా ఈ ఫీచర్‌ను స్మార్ట్‌టీవీ, గేమింగ్‌ కన్సోల్‌లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలానే చూసిన వీడియోను మరలా.. మరలా చూసేందుకు తీసుకొచ్చిన సింగిల్ లూప్‌ ఫీచర్‌ను, ఇక మీదట మెనూలో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా దీనితో యూజర్స్‌ వీడియో క్వాలిటీని కూడా మార్చుకోవచ్చు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details