భారత్ సహా పలు దేశాల్లో ఇవాళ యూట్యూబ్ సేవలకు కొంతసేపు ఆటంకం కలిగింది. వినియోగదారులు వీడియోలు చూసేందుకు వీలుకాలేదు. సమస్యపై తక్షణమే స్పందించిన యాజమాన్యం గంటలోపే సమస్యను పరిష్కరించింది. వీక్షకులు గణనీయంగా పెరగటం వల్ల సర్వర్‌పై లోడ్ ఎక్కువై ఇబ్బందులు తలెత్తినట్లు సంస్థ వివరణ ఇచ్చింది.
ETV Bharat / science-and-technology
ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. కామెంట్లతో నెటిజన్లు ఫైర్ - youtube is down again
సాంకేతిక సమస్యల కారణంగా గురువారం ఉదయం యూట్యూబ్ సేవలకు అంతరాయం కలిగింది. దీనిపై స్పందించిన యాజమాన్యం పరిస్థితిని గంటలోపే చక్కదిద్దింది.
![ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. కామెంట్లతో నెటిజన్లు ఫైర్ YouTube faces massive outage in India, back now](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9519787-686-9519787-1605161299585.jpg)
నిలిచిన యూట్యూబ్ సేవలు, పునరుద్ధరణ
యూట్యూబ్ సేవలు నిలిచిపోయిన వెంటనే సామాజిక మధ్యమాల్లో నెటిజన్లు విశేషంగా స్పందించారు. 'YOUTUBEDOWN' అనే హ్యష్‌ట్యాగ్‌తో విపరీతంగా కామెంట్లు పెట్టడం వల్ల ఈ కీవర్డ్ ట్రెండింగ్‌లో కొనసాగింది. కేవలం ఒక్క గంటలో సుమారు 2లక్షల 80వేల మంది సమస్యపై చర్చించారు.సేవల్లో అంతరాయంపై క్షమాపణలు చెప్పిన యూట్యూబ్.. సమస్య పరిష్కారమయ్యాక ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది.
Last Updated : Feb 16, 2021, 7:52 PM IST