వాట్సాప్ అనేది సమాచార మార్పిడికి మంచి (WhatsApp account banned reason) సామాజిక మాధ్యమం. అయితే.. కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి వారి అకౌంట్లను (WhatsApp account banned) రద్దు చేస్తుంటుంది ఆ సంస్థ. తెలియక చేసినా మీ అకౌంట్‌ను కూడా రద్దు చేస్తుంది. అయితే.. అకౌంట్ రద్దు కాకుండా ఉండాలంటే ఆ సంస్థ నియమాలను ఉల్లంఘించకూడదు.
తమ వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా వాట్సప్ కఠిన చర్యలు చేపడుతోంది. సంస్థ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారి అకౌంట్లను నిర్ధాక్షిణ్యంగా రద్దు చేస్తుంది. ఇటీవల భారీ మొత్తంలో అకౌంట్లను రద్దు చేసింది. ఒక్క ఆగష్టు నెలలోనే 20 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. జూన్, జులైలో 30 లక్షల అకౌంట్లను రద్దు చేసింది.
థర్డ్ పార్టీ యాప్స్ వాడకం..
జీబీ వాట్సాప్ యాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్.. ఇంకా అనేక వెర్షన్లు (WhatsApp account banned) ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ కూడా అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. కానీ వీటి వాటకం వాట్సాప్ నియమాలకు విరుద్ధం. తెలియక మీరు వీటిని వాడినా మీ అకౌంట్ రద్దయినట్లే.