డేటా లీకులు ఇటీవల నెటిజన్లను నిత్యం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మన డేటా అసలు లీకైందా లేదా తెలుసుకోవాలని అప్పుడప్పుడు అనుకుంటాం. అది తెలుసుకోవడానికి సులభమైన పద్దతులు అందుబాటులో ఉన్నాయి. .
ఈ వెబ్‌సైట్‌తో..
'Have I been PWNED' అనే వెబ్సైట్ ఉంది. ఈ సైట్లో మీ ఈమెయిల్ గానీ ఫోన్ నెంబర్‌ను సర్చ్ చేస్తే.. డేటా లీకు గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ఈ మెయిల్ అడ్రస్‌తో మాత్రమే వివరాలు తెలుసుకునే వీలుండేది. ఇటీవల ఫోన్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకునేలా వీలు కల్పించారు. ఈ ఫోన్ నెంబర్‌ను ఈ వెబ్సైట్లో సర్చ్ చేస్తే డేటా లీకైందా లేదా తెలుసుకోవచ్చు.
ఫేస్బుక్ డేటా లీక్..
కొన్ని రోజుల క్రితం ఓ వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో లీకైనట్లు నివేదికలు వచ్చాయి. అమెరికాలో 539 మిలియన్ల యూజర్లు, యూకేలో 11 మిలియన్లు, భారత్‌లో 6 మిలియన్ల యూజర్లు ఇందులో ఉన్నారని వెల్లడించాయి.
9.9 కోట్ల భారత యూజర్ల డేటా లీక్..
డేటా లీక్ భారత్‌ను కలవరపెట్టింది. మొబిక్విక్ యూజర్లలో 9.9 భారత యూజర్ల డేటా లీకైందని వార్తలు వెల్లడయ్యాయి. హ్యాకర్లు కూడా డేటా లీక్ చేసినట్లు ప్రకటించారు. ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్లు, బ్యాంకు వివరాలు అందులో ఉన్నాయని సమాచారం.
డేటా రక్షణకు విధానాలు
- కఠినమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- సెక్యురిటీలో రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకునే పద్దతిని పాటించాలి.
- బయోమెట్రిక్ పాస్వర్డ్ తయారు చేసుకోవాలి.
ఇదీ చదవండి:CYBER ATTACK: బ్యాంక్ సర్వర్లోకి చొరబడి కోట్లు కొల్లగొట్టింది ఎందరు..?