భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను ఏలుతున్న చైనా కంపెనీ 'షియోమీ' ఇప్పుడు స్మార్ట్ టీవీల వ్యాపారాలపై దృష్టి సారించింది. ఇప్పటికే స్మార్ట్ టీవీల సెగ్మెంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ కంపెనీ.. ఇప్పుడు ప్రీమియం మోడళ్లనూ దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా 55 అంగుళాల ఎంఐ బ్రాండ్.. క్యూఎల్ఈడీ టీవీని ఈ నెల 16న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఈ టీవీ పూర్తిగా భారత్‌లోనే అసెంబుల్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ఫీచర్లు, ధర వంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
అయితే ఎంఐ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. కొత్త స్మార్ట్ టీవీలో 4కే రెసొల్యూషన్స్, డాల్బీ ఆడియో సపోర్ట్ వంటివి ఉండనున్నట్లు తెలిసింది.