తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

X Job Hiring Feature : మీకు నచ్చిన జాబ్ కోసం వెతకడం, అప్లై చేయడం ఇక మరింత ఈజీ.. ఎలాగంటే? - tech news in telugu

X Job Hiring Feature In Telugu : ఎక్స్ (ట్విట్టర్​)​ ప్లాట్​ఫాం జాబ్​ హైరింగ్ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సంస్థలు తమ ఎక్స్ ప్రొఫైల్​లో ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థులు కూడా నేరుగా ఈ వేదిక నుంచే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీలు కలుగుతుంది. మరి ఈ నయా ఫీచర్​ పూర్తి వివరాలు మనమూ తెలుసుకుందామా?

Twitter job hiring feature
X Job Hiring Feature

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 1:11 PM IST

X Job Hiring Feature : ఎలాన్​ మస్క్​ నేతృత్వంలోని ఎక్స్​ (ట్విట్టర్​) ఎప్పటి నుంచో ఊరిస్తున్న జాబ్​ హైరింగ్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వెరిఫైడ్​ ఆర్గనైజేషన్స్​ ఇందులో ఉద్యోగ ప్రకటనలు చేసుకోవచ్చు. అలాగే యూజర్లు కూడా చాలా సులువుగా జాబ్​ నోటిఫికేషన్లను తెలుసుకోవచ్చు. అలాగే ఇదే వేదిక నుంచి ఆయా పోస్టులకు అప్లై కూడా చేసుకోవచ్చు.

వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్​కు మాత్రమే!
X Hiring Feature Eligibility Criteria : ఎక్స్​ తీసుకొచ్చిన ఈ నయా జాబ్​ హైరింగ్​ ఫీచర్​..​ ప్రస్తుతం ధ్రువీకరణ పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించడానికి వీలవుతుంది. దీని ద్వారా ఆయా సంస్థలు తమ ఎక్స్​ (ట్విట్టర్​) హ్యాండిల్స్​లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయవచ్చు.

"ఎక్స్​ హైరింగ్​ బీటా వెర్షన్​ను ముందస్తుగా అన్​లాక్ చేసుకోండి. ముఖ్యంగా వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్​కు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ జాబ్​ హైరింగ్ ఫీచర్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఉన్న ఉద్యోగార్థులను చేరుకోవచ్చు. కనుక ఈ రోజే బీటా వెర్షన్​ కోసం దరఖాస్తు చేసుకోండి."
- ఎక్స్ హైరింగ్​​ ట్వీట్​

ఎక్స్​ హైరింగ్ ఫీచర్స్​ :
X Hiring Feature For Job Search :

  • ఎక్స్​ హైరింగ్​ టూల్​ అనేది ఆయా సంస్థలు.. అప్లికెంట్​ ట్రాకింగ్ సిస్టమ్​ (ATS) లేదా XML ఫీడ్​ను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీని ద్వారా ఆయా కంపెనీలు తమ ఉద్యోగ ప్రకటనలు ఈ వేదికలోనే చేసుకునే వీలు కలుగుతుంది.
  • ఈ ఫీచర్ వాడాలంటే.. ఆయా సంస్థలు కచ్చితంగా ఎక్స్​ ప్లాట్​ఫాంలో ధ్రువీకరణ పొంది ఉండాలి. అలాగే నెలవారీగా 1000 డాలర్లు (సుమారు రూ.82,000) కూడా చెల్లించాలి.
  • జాబ్​ హైరింగ్​ ఫీచర్​ ఎనేబుల్ చేసుకున్న సంస్థలు.. తమ ఎక్స్​ ప్రొఫైల్స్​లో జాబ్​ వేకెన్సీస్​ (ఉద్యోగ ప్రకటనలు) చేయవచ్చు.
  • ఉద్యోగార్థులు.. కీవర్డ్స్​, లొకేషన్​, జాబ్​ నేమ్​, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్​ మొదలైన సెర్చ్​వర్డ్స్​తో ఉద్యోగ ప్రకటనలను సెర్చ్​ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు నేరుగా ఎక్స్​ ప్లాట్​ఫాంలోనే ఆయా పోస్టులకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
  • సంస్థలు కూడా తాము ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను.. నేరుగా ఈ ఎక్స్​ ప్లాట్​ఫాంలోనే కాంటాక్ట్​ అయ్యి.. నియామకాలు చేసుకోవడానికి వీలవుతుంది.

బీటా వెర్షన్​
X Hiring Beta Version : ప్రస్తుతం ఎక్స్ హైరింగ్ ఫీచర్ బీటా వెర్షన్​లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ త్వరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే.. లింక్డ్ ఇన్​ లాంటి ప్రొఫిషనల్ జాబ్​ పోర్టల్స్​కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details