Twitter as X.COM : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌తో ఒక ఆటఆడుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్ వెబ్‌సైట్‌ను x.comకు అనుసంధానం చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే బ్లూబర్డ్ లోగోను మార్చేసిన ఎలాన్ మస్క్.. దాని స్థానంలో X సింబల్ లోగోను తీసుకొచ్చారు. ఇది మస్క్ మస్తిష్కంలో 'X'కు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. రానున్న రోజుల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని X కార్పొరేషన్ ద్వారానే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.
ఎక్స్ ప్రస్థానం.. అలా మొదలైంది!
Elon musk x.com history : ఎలాన్ మస్క్‌కు X అంటే చాలా ఇష్టం. 1990 సంవత్సరం నుంచే మస్క్‌కు Xతో బాగా అనుబంధం ఉంది. వాస్తవానికి 1999లో ఎలాన్ మస్క్ X.COM పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. కానీ తరువాత ఆ డొమైన్ PayPal చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే 2017లో ఎలాన్ మస్క్ x.comను మరలా కొనుగోలు చేశారు. ఇది తన సెంటిమెంట్ అని కూడా ఆ సందర్భంలో మస్క్ పేర్కొనడం విశేషం. తనకు ఆ డొమైన్‌ను తిరిగి అందించిన పేపాల్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్తబ్దుగా ఉంచిన ఆ డొమైన్‌తో.. ప్రస్తుతం ట్విట్టర్‌ను అనుసంధానం చేశారు.
X - సెంటిమెంట్
Elon musk X sentiment analysis : ఎలాన్ మస్క్‌కు X అంటే ఎంతో సెంటిమెంట్. అందుకే తను ప్రారంభించిన కంపెనీల్లో X అక్షరం వచ్చేలా చాలా జాగ్రత్త తీసుకుంటారు. అంతరిక్ష ప్రయోగాల కోసం 2022లో ప్రారంభించిన సంస్థ SpaceX; ఎలక్ట్రిక్ కారు మోడల్ X, చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరులోనూ (ఎక్స్ ఏఈ ఏXII) X అనే పదాన్ని వదలలేదు. ఇటీవల xAI పేరుతో ఒక కృత్రిమ మేధ సంస్థను కూడా మస్క్ స్థాపించారు. తాజాగా ట్విట్టర్ పేరెంట్ సంస్థ పేరునూ 'ఎక్స్ కార్పొరేషన్'గా మార్చారు.