తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఏడాది మొత్తంలో ఈరోజే షార్టెస్ట్​ డే.. ఎందుకో తెలుసా? - సైన్స్​ న్యూస్​ లేటెస్ట్​

Winter Solstice 2021: సోల్​స్టీస్​ ప్రభావంతో ఈరోజు ఏడాది మొత్తంలో అత్యంత తక్కువ సేపు పగలు ఉంటుంది. ఇంతకీ ఈ సోల్​స్టీస్​ అంటే ఏంటి? అది ఎలా సంభవిస్తుంది?

Winter Solstice 2021
ఏడాది మొత్తంలో ఈరోజే షార్టెస్ట్​ డే.. ఎందుకో తెలుసా?

By

Published : Dec 21, 2021, 8:22 PM IST

Winter Solstice 2021: డిసెంబర్ 21.. ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా? ఇది సంవత్సరంలో అత్యంత చిన్న రోజు. సూర్యుడు ఉదయం 7.10 గంటల నుంచి సాయంత్రం 5.29 గంటల మధ్యే ఉంటాడు. వింటర్​ సోల్​స్టీస్​గా పిలిచే ఈ రోజు గురించి గూగుల్​ కూడా తన సెర్చ్​ ఇంజిన్​లో ప్రత్యేక డూడుల్​ని చేసింది. ఇంతకీ ఈ సోల్​స్టీస్​ అంటే ఏంటో.. వాటి వివరాలు ఎంటో తెలుసుకుందాం.

సోల్​స్టీస్​ అంటే..

సుదీర్ఘ రాత్రి లేదా పగలు ఉన్న రోజులను సోల్​స్టీస్​ అంటారు. ఏటా జూన్​ 21న, డిసెంబరు 21న.. రెండు సందర్భాల్లో ఈ సోల్​స్టీస్​ ఏర్పడుతుంది. లాటిన్​ భాషలోని సోల్​, సిస్​టెరీ అనే పదాల నుంచి ఈ సోల్​స్టీస్​ వచ్చింది. జూన్​లో వచ్చే దానిని సమ్మర్​ సోల్ట్​స్టిస్​, డిసెంబర్​లో ఏర్పడే దానిని వింటర్ ​సోల్ట్​స్టీస్​గా పేర్కొంటారు.

భూమి ఉత్తరధ్రువం సూర్యుడికి దూరంగా వెళ్లడం సహా సూర్యుడు మకర రేఖపైకి రావడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. యూకే, అమెరికా, భారత్​, రష్యా, చైనా సహా కెనడా దేశాల్లో ఈ సోల్​స్టీస్​ ప్రభావం ఉంటుంది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 9.29 గంటలకు ఈ వింటర్​ సోల్​స్టీస్​ ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి అక్షరేఖ 23.5 డిగ్రీలు వంపు తిరుగుతుంది.

ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఇక నుంచి క్రమంగా రాత్రి సమయం తగ్గి పగలు పెరుగుతుంది. అదే విధంగా సమ్మర్​ సోల్​స్టిస్​ తర్వాత క్రమంగా పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంటుంది.

ఇదీ చూడండి :52 స్టార్​లింక్​ ఉపగ్రహాలతో కక్ష్యలోకి స్పేస్​ ఎక్స్​ రాకెట్​

ABOUT THE AUTHOR

...view details