తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Windows 11: అక్టోబర్​ 5నుంచి అందుబాటులోకి విండోస్ 11 - మైక్రోసాఫ్ట్

విండోస్​ 11 (Windows 11)పై కీలక ప్రకటన చేసింది మైక్రోసాఫ్ట్. అక్టోబర్​ 5న ఈ కొత్త ఓఎస్​ను​ అర్హత కల్గిన అన్ని రకాల పీసీల్లో అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది.

Windows 11
విండోస్ 11

By

Published : Sep 1, 2021, 10:20 AM IST

అక్టోబర్​ 5 నుంచి కొత్త ఆపరేటింగ్​ సిస్టం విండోస్ 11 (Windows 11) అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది మైక్రోసాఫ్ట్. ఆ తేదీ నుంచి ముందుగానే విండోస్ 11 లోడ్​ చేసిన పీసీలు సహా అర్హత కలిగిన విండోస్​-10 పీసీల్లోనూ ఈ కొత్త ఓఎస్​ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అధునాతన ఫీచర్లు, డిజైన్​తో వస్తున్న ఈ ఓఎస్​ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విండోస్ 11 ఓఎస్

"మునుపెన్నడూ లేని విధంగా పీసీలు మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే విండోస్​ 11ను మీ ఉత్పాదకత పెంచి, సృజనాత్మకతకు రెక్కలు తొడిగేలా తీర్చిదిద్దాం." అని మైక్రోసాఫ్ట్​ పేర్కొంది.

ఇవీ హైలైట్స్​..

  • అధునిక డిజైన్, సౌండ్ సిస్టమ్​తో వచ్చే ఓఎస్​ వాడటానికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది
  • రీసెంట్​ ఫైల్స్​ను చూసుకోవడానికి డివైజ్​ ఏదైనా క్లౌడ్​, మైక్రోసాఫ్ట్​ 365 వినియోగించుకునేలా రూపకల్పన
  • మల్టీ టాస్కింగ్, స్నాప్​ లేఅవుట్, స్నాప్ గ్రూప్స్​ ఫీచర్
  • ప్రజలు త్వరగా అనుసంధానం కావడానికి టాస్క్​బార్​లో మైక్రోసాఫ్ట్​ టిీమ్స్​ సదుపాయం
    విండోస్ 11
  • సమాచారాన్ని త్వరితగతిన అందుకోవడానికి ఏఐతో కూడిన విడ్జెట్స్
  • హై క్వాలిటీ గేమ్స్​ ఆడటానికి అందుబాటులోకి డైరెక్ట్​ఎక్స్​12 అల్టిమేట్​, డైరెక్ట్​సోరేజీ వంటి సాంకేతికతలు
  • కావాల్సిన యాప్స్​ కోసం విశ్వనీయ, సరికొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్
  • దివ్యాంగులు సులువుగా వాడుకునేలా ప్రత్యేకమైన డిజైన్
  • స్టోర్​లో కొత్త యాప్స్​ ఉంచేందుకు డెవలపర్లు, క్రియేటర్లకు అవకాశం
  • టచ్​, డిజిటల్ పెన్, వాయిస్ ఇన్​పుట్​లతో వేగంగా, సమర్థవంతమైన పనితీరుతో ఓఎస్
  • హైబ్రిడ్​ పనుల కోసం రూపొందించిన విండోస్ 11లో పీసీ భద్రత కోసం పటిష్ట సాంకేతిక ఏర్పాటు

ఇదీ చూడండి:Windows 11: చాట్, కాల్స్కి కొత్త యాప్

ABOUT THE AUTHOR

...view details