Background apps on Android: ఫోన్‌లో తరచూ రీసెంట్ యాప్స్ ఫీచర్‌తో బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేస్తుంటాం. వాడకపోయినా వెనకాల ఇవి అలాగే రన్ అవుతుంటే బ్యాటరీని ఖర్చు చేస్తాయని, ఎక్కువ డేటా తీసుకుంటాయని, ఫోన్ వేగం తగ్గుతుందని భావిస్తుంటాం. ఆండ్రాయిడ్ ఫోన్ల విషయంలో బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ. యాప్స్ పనిచేయటానికి ఆండ్రాయిడ్‌ను రూపొందించిన తీరు గురించి తెలిస్తే ఇది నిజమేనని అంగీకరించక తప్పదు.
బ్యాక్‌గ్రౌండ్ మెమరీలో యాప్స్ ఉండే విధంగానే ఆండ్రాయిడ్‌ను రూపొందించారు. అంతేకాదు, అవసరమైనప్పుడు తనకు తానే యాప్స్‌ను క్లోజ్ చేసుకునేలా తయారుచేశారు కూడా. అందువల్ల మనం పని గట్టుకొని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ ఉండటం వల్ల మరో ప్రయోజనం ఓపెన్ చేసినప్పుడు అవి త్వరగా లాంచ్ అవుతాయి. బ్యాటరీని ఎక్కువగా వాడుకోకుండానే పనిచేస్తాయి.