తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

యాపిల్ ఉత్పత్తుల పేర్లన్నీ 'ఐ'తోనే! ఎందుకలా? - యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ గురించి చెప్పండి

సగం కొరికిన యాపిల్.. టెక్​ ప్రియులకు పరిచయం అక్కర్లేని ప్రీమియం బ్రాండ్ ఇది. ఐ ఫోన్, ఐ మ్యాక్, ఐపాడ్ ఇలా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను అందించిన ఈ సంస్థ ఉత్పత్తుల పేర్లన్నీ "ఐ" తోనే ఎందుకు ప్రారంభమవుతాయో తెలుసా? ఈ ప్రశ్న మనలో చాలామందికి తలెత్తి ఉండొచ్చు. యాపిల్ అసలెందుకు 'ఐ'ని ఎంచుకుందో తెలుసుకుందామా?

Here's Why Apple Products Names Start With an "i"
యాపిల్ ఉత్పత్తుల పేర్లన్నీ 'ఐ'తోనే! ఎందుకలా?

By

Published : Jul 18, 2021, 3:01 PM IST

ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ యాపిల్​కి సంబంధించిన ఉత్పత్తుల పేర్లన్నీ "ఐ" తోనే ఆరంభమవుతాయి. ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా ఉన్న ఈ పేరు ఎలా వచ్చింది? దాని అర్థం ఏంటి? తెలుసుకుందామా..

ఐమ్యాక్.. ఓ సంచలనం..

1998లో యాపిల్ మొదటి ఉత్పత్తి ఐమ్యాక్​ విడుదలైంది. ఇంటర్నెట్ జనాదరణ పొందుతున్న తొలినాళ్లలో మార్కెట్లోకి వచ్చిన ఈ కంప్యూటర్ అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. వేగంగా, సులభంగా ఇంటర్నెట్‌ కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఐమ్యాక్ విజయవంతమైంది. అంతేగాక మార్కెట్లోని ఇతర కంప్యూటర్లతో పోల్చితే రికార్డుస్థాయి అమ్మకాలు సాధించింది. అప్పటికే 'ఐ' పై అనేక కథలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో స్పందించిన యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ స్పష్టతనిచ్చారు. ప్రజలకు వేగంగా ఇంటర్నెట్‌ను అందించడమే ఐమ్యాక్ పని కాబట్టి.. ఐ అంటే "ఇంటర్నెట్" అని ఆయన చెప్పకనే చెప్పారు.

యాపిల్ ఐ ఫోన్

యాపిల్ డిక్షనరీ!

ఇక సంస్థాగతంగా చూస్తే.. 'I' అంటే - Individual, Inspire, Inform, Instruct ఇలా పలు అర్థాలను ఉద్యోగుల సమావేశంలో ఓసారి వివరించారు జాబ్స్. ఈ క్రమంలోనే సంస్థ తర్వాతి ఉత్పత్తులైన ఐఫోన్‌(2007), యాపిల్ టీవీ, యాపిల్ వాచ్ వంటి అనేక ఉత్పత్తుల పేర్లు 'ఐ' అని వచ్చేలా ప్రారంభించారు. యాపిల్​కు ఓ డిక్షనరీ అంటూ ఉంటే.. 'ఐ' కి "ఇంటర్నెట్" అనేదే సరైన నిర్వచనమని టెక్​ నిపుణులు అభివర్ణిస్తుంటారు.

యాపిల్ ఐ ప్యాడ్

భవిష్యత్​​లో 'ఐ' ఉండదా?

అయితే.. యాపిల్ క్రమంగా 'ఐ' అక్షరానికి దూరంగా జరుగుతోందా అంటే అవుననే సమాధానం అంటున్నారు నిపుణులు. స్టీవ్​జాబ్స్ అనంతరం యాపిల్ బాధ్యతలు చేపట్టిన టిమ్​కుక్ సారథ్యంలో 2014లో ఎయిర్‌పాడ్స్‌, ఎయిర్‌ట్యాగ్స్ వంటివాటిని సంస్థ విడుదల చేసింది. దీనితో యాపిల్ మ్యాక్‌, ఎయిర్​ఫోన్ కూడా వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

యాపిల్ వాచ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details