ఇంటర్మీడియట్ పూర్తయ్యే విద్యార్థులు ఏం కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందో ఆలోచిస్తుంటారు. కెరియర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకునేముందు అసలీ ప్రపంచం ఎటు వైపు నడుస్తోంది, సాంకేతిక రంగం ఏ విధంగా పురోగతి చెందుతోంది అనేది గ్రహించాలి. ముఖ్యంగా కంపెనీలు ఇప్పుడు ఎటువంటి నైపుణ్యాల కోసం చూస్తున్నాయి? ఏవి నేర్చుకుంటే కాలేజీ పూర్తి చేశాక ఎక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాలు వస్తాయి? ఇలాంటి విషయాలపై అవగాహన చాలా అవసరం!
సాంకేతిక పురోగమన విషయంలో అవగాహన రావాలంటే.. ఇండస్ట్రీ 4.0 గురించి తెలుసుకోవాలి. 17వ శతాబ్దపు చివరి నుంచి 18వ శతాబ్దపు మొదటి సంవత్సరాల మధ్యలో ఆవిరితో నడిచే యంత్రాలను కనుగొన్నారు. ఈ సాంకేతికతతో మొదటి పారిశ్రామిక విప్లవం మొదలయింది. అంటే అప్పటివరకు మనిషి తనశక్తితో చేసిన పనులు యంత్రాల సహాయంతో చేయడం అన్నమాట. అదే సమయంలో ఆవిరితో నడిచే రైళ్లు ప్రయాణాలనూ, రవాణానూ సులువు చేశాయి. 18వ శతాబ్దపు చివరి నుంచి 19వ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో విద్యుచ్ఛక్తితో రెండో పారిశ్రామిక విప్లవం ఆరంభమయింది. ఈ సాంకేతికతతో మునుపెన్నడూ లేని ఉద్యోగాలు వెలుగులోకి వచ్చాయి.
1950ల నుంచి సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్- ఇలా ఈ టెక్నాలజీల్లో చాలా పురోగతి సాధించడం మూడో పారిశ్రామిక విప్లవం. ఈ సారి ప్రపంచంలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని కొత్త రంగాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నేడు కోట్లమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఐటీ రంగం వాటిలో ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి పెద్ద కంపెనీలన్నీ ఈ మూడో పారిశ్రామిక విప్లవం నుంచి పుట్టినవే.
ఇక 2000ల నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలయింది. ఇండస్ట్రీ 4.0 అంటే ఇదే! ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (ఐఓటీ), ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటేడ్ రియాలిటీ, 3 డీ ప్రింటింగ్, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో 4.0 టెక్నాలజీలు పరిశ్రమల రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీ ఈ 4.0 టెక్నాలజీల వైపు అడుగులు వేస్తున్నాయి. లేదంటే వాటి మనుగడకే ముప్పు. అదే సమయంలో కోట్లలో కొత్త ఉద్యోగాలను తీసుకొస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం ఈ 4.0 టెక్నాలజీల్లో 2022కి 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి!
ఇండస్ట్రీ 4.0లో చాలా ఉద్యోగావకాశాలున్న టెక్నాలజీలను క్లుప్తంగా చూద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్..
మొబైల్ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తోనే పనిచేస్తుంది. మనం తరచూ వినే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆటో పైలెట్ లాంటి వాటిలో, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ లాంటి స్మార్ట్ డివైసెస్‌లోనూ ఉపయోగించేది ఏఐనే. ఈ టెక్నాలజీలో ఇంకా చాలా రాబోతున్నాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, బ్యాంకింగ్.. ఇంకా చాలా రంగాల్లో ఏఐని ఉపయోగించబోతున్నారు. దీనివల్ల చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం 2022కి 6 కోట్ల కొత్త ఉద్యోగాలకు ఆస్కారం ఉంది.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్..
విదేశాల్లో ఉన్న స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడటం, ఇష్టమైన సినిమాను ఎంచుకుని చూడటం.. ఇలా ఎన్నెన్నో పనులు స్మార్ట్ ఫోన్‌తో చేయగలుగుతున్నాం. ఒక్క స్మార్ట్ ఫోన్‌తోనే ఇన్ని చేయగలుగుతుండగా... టీవీ, ఏసీ, లైట్, ఫ్యాన్స్ ఇలా అన్నీ అనుసంధానమై మనం బయటకు వెళ్లేటపుడు వాటంతట అవే స్విచాఫ్ అయ్యి, మళ్లీ ఇంటికొచ్చినపుడు వాటికవే స్విచాన్ అయితే?ఇవన్నీ సాధ్యపడాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కనెక్ట్ అయ్యి తెలివైన నిర్ణయాలు తీసుకోగలగాలి. అలా చెయ్యగలిగే టెక్నాలజీయే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ). కేవలం ఒక స్మార్ట్ ఫోన్‌తోనే గత పది సంవత్సరాల్లో డెవలపర్‌లకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇక ఈ ఐఓటీతో రాబోయే దశాబ్దంలో అవకాశాలకు కొదువే లేదు. 2017లో టెలికాం విభాగం తెలిపిన ప్రకారం కేవలం భారత్‌లోనే సుమారు 1.5 కోట్ల ఉద్యోగాలు దీనిలో రాబోతున్నాయి.
సైబర్ సెక్యూరిటీ ..