Whatsapp Delete For EveryOne Option: ప్రపంచంలో ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. నిత్యం కోట్లాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ఇతరులతో చాట్ చేస్తుంటారు. అవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ చేసుకుంటారు. అయితే.. చాటింగ్ చేస్తున్న సమయంలో మీరు ఎప్పుడైనా ఓ మెసేజ్.. ఒకరికి పంపబోయి మరొకరికి పంపారా? పోనీ పంపాక రెండు గంటలు తర్వాత చూసుకున్నారా? అప్పుడు అబ్బా.. చూసుకోలేదే అని బాధపడక్కర్లేదు. ఎందుకంటే వాట్సాప్ త్వరలోనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. మెసేజ్ చేసి రెండు రోజులు అయినా డిలీట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
వాట్సాప్ చాట్‌లో 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట.. ఆ ఫీచర్‌ను ఎనిమిది నిమిషాలకు మాత్రమే పరిమితం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు డిలీట్ చేసే అవకాశాన్నిచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను ఇంకాస్త సమయానికి పెంచుదామని వాట్సాప్ యోచిస్తోంది.