తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్​ కొత్త ఫీచర్​.. సులభంగా ఫొటోను స్టిక్కర్​గా! - అందుబాటులోకి వాట్సాప్​ కొత్త ఫీచర్​

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్​(whatsapp new features)తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. ఈ అప్​డేట్​తో థర్డ్​ పార్టీ యాప్​ అవసరం లేకుండా సింపుల్​గా వాట్సాప్​లోనే ఫొటో స్టిక్కర్ సదుపాయన్ని తీసుకొచ్చేందుకు ఈ మెసేజింగ్​ యాప్​ ప్రణాళికలు రచిస్తోంది.

WhatsApp
వాట్సాప్​

By

Published : Sep 18, 2021, 8:22 PM IST

ఎల్లప్పుడూ వినియోగదారులకు కొత్త కొత్త అప్​డేట్స్​ ఇస్తూ వారిని ఆకర్షిస్తుంటుంది ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ వాట్సాప్. తాజాగా మరోసారి ఓ సరికొత్త ఫీచర్​తో(whatsapp new features)​ రాబోతుంది. దీంతో వినియోగదారులు వారి ఫొటోలను స్టిక్కర్​లుగా మార్చుకునే సదుపాయాన్ని కల్పించనుంది. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని థర్డ్​ పార్టీ యాప్​లతో అందిస్తున్న వాట్సాప్​.. తాజా నిర్ణయంతో బయట యాప్​లపై వినియోగదారులు ఆధారపడుకుండా అందులోనే తయారు చేసుకోవచ్చని వాబీటాఇన్​ఫో తెలిపింది.

ఎలా పని చేస్తుంది?

యూజర్లు యాప్‌లో కొత్త చిత్రాన్ని అప్‌లోడ్ చేసేటప్పుడు క్యాప్షన్ బార్ పక్కన కొత్త స్టిక్కర్ ఐకాన్ ఉంటుంది. దానిని ఎంచుకున్నప్పుడు ఆ ఇమేజ్​ను ఫొటోలా పంపాలా? లేక స్టిక్కర్​లా పంపాలా? అనేది యూజర్​ నిర్ణయిస్తాడు. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. దీనిని డెస్క్‌టాప్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్ 2.2137.3 డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్నట్లు వాబీటాఇన్​ఫో పేర్కొంది.

డెస్క్​టాప్​ వినియోగదారుల కోసం గత నెలలో వాట్సాప్ బీటా వెర్షన్​ను విడుదల చేసింది. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను పరీక్షించింది. ఈ వెర్షన్​ను విండోస్​, మ్యాక్​ఓఎస్​ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

ఇదీ చూడండి:Android 12: ఆండ్రాయిడ్​ కొత్త వెర్షన్​.. రిలీజ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details