Whatsapp tricks for android users : ఆధునిక కాలంలో వాట్సాప్ వాడని వారంటూ ఎవరూ ఉండరు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో సపోర్ట్ చేసే ఫ్రీ మెసేజింగ్ యాప్. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ వచ్చినప్పటికీ దానిలో ఉన్న కిటుకులు చాలా మందికి తెలియదు. వాట్సాప్‌ను ఇంకా మెరుగ్గా ఉపయోగించేందుకు ఈ 5 ట్రిక్స్ మీ కోసం..
గ్రూప్‌లో మెసేజ్‌లు చూసేయొచ్చు సీక్రెట్‌గా..
సాధారణంగా గ్రూప్‌లో కొన్ని వందల మెసేజ్‌లు వస్తుంటాయి. అందరూ అన్ని మెసేజ్‌లు చదవటానికి ఇష్టపడరు. అలా అని మనం ఒక్క మెసేజ్ చూడాలని గ్రూప్ ఓపెన్ చేస్తే ఇక అంతే.. బ్లూటిక్ వల్ల అన్ని మెసేజ్‌లు చూసినట్లు తెలిసిపోతుంది. ఇలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వాట్సాప్‌లో ఓ కొత్త ఫీచర్ మనకు అందుబాటులో ఉంది.. ఆండ్రాయిడ్ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై వాట్సాప్ విడ్జెట్‌ను ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఒక చిన్న స్క్రీన్‌లో అన్ని మెసేజ్‌లు కనిపిస్తాయి. స్క్రోలింగ్ సదుపాయంతో మెసేజ్‌లను ఈజీగా చూసేయొచ్చు.
విడ్జెట్ ఓపెన్ చేయడం ఎలా..
హోమ్స్క్రీన్ పై లాంగ్ ప్రెస్ చేస్తే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో విడ్జెట్ ఆప్షన్ ఒకటి. దాన్ని ఎంచుకుని స్క్రోల్ చేస్తే అందులో వాట్సాప్ విడ్జెట్ లభ్యమవుతుంది. దాన్ని సెలక్ట్ చేసుకోండి అంతే.. ఇక ఎవరికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్‌లు చదివేయొచ్చు ఈజీగా.
చాట్‌కి పెట్టేయొచ్చు టైమర్ ఇలా..
ఇటీవలే వాట్సాప్‌లో పాపులరైన ఫీచర్లలో డిస్అప్పీయరింగ్ మెసేజ్‌లు ఒకటి.. నిర్దిష్టమైన సమయంలో మెసేజ్‌లు వాటంతట అవే మాయమయిపోతాయి. దీని వల్ల చాట్ హిస్టరీ డిలీట్ అవ్వడమే కాకుండా మెమొరీ క్లీన్ అవుతుంది. అయితే చాలా వరకు ఈ ఫీచర్‌ని మాన్యువల్ ఉపయోగించేవారే ఎక్కువగా ఉన్నారు. ఒక చాట్‌కి టైమర్ సెట్ చేయడమో లేకపోతే మాన్యువల్‌గా డిలీట్ చేయడమో చేసేవారు ఉన్నారు. అలాంటివారి కోసం ఈ ఆటో టైమర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
ఆటో టైమర్ సెట్ చేయడం ఎలా..
వాట్సాప్ సెట్టింగ్స్‌ను ఎంచుకోవాలి. సెట్టింగ్స్‌లో అకౌంట్ సెట్టింగ్స్‌ను ఎంచుకున్నాక అందులో ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రైవసీ సెట్టింగ్స్‌లో డీఫాల్ట్ మెసేజ్ టైమర్ సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకున్నాక మనం అందులో మెసెజ్ డిసఅప్పీయరింగ్ టైమర్‌ను మనం 24 గంటలు, వారం లేదా 90 రోజులకు సెలక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ ఆప్షన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.
తక్కువ డేటాతో బెటర్ క్వాలీటీ ఫొటోలను పంపేయండిలా..
మనం ఎప్పుడైనా వాట్సాప్‌లో ఫొటోలు షేర్ చేసేటప్పుడు క్లారిటీ గల ఫొటోలు పంపిచాంలంటే ఇక డేటా ఎక్కువైపోతుందేమో అని ఆలోచిస్తుంటాం. కానీ ఇక ఆ ఆలోచనను వదిలేయమంటోంది వాట్సాప్ సంస్థ.
సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. స్టోరేజ్ అండ్ డేటాను ఎంచుకోవాలి.
ఆప్షన్‌ను ఎంచుకుని స్క్రోల్ చేశాక ఫొటో అప్లోడ్ క్వాలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
అందులో బెస్ట్ క్వాలిటీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.