Whatsapp New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. త్వరలోనే 32 మంది ఒకేసారి గ్రూప్ వాయిస్కాల్ చేసుకునే సదుపాయాన్ని జోడించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రూప్ వాయిస్కాల్లో గరిష్ఠంగా.. ఎనిమిది మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.
ETV Bharat / science-and-technology
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్.. ఒకేసారి 32 మందితో - Whatsapp news
Whatsapp New Feature: ఓకేసారి 32 మందికి గ్రూప్ కాల్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.
Whatsapp New Feature
ఇంకా 1 జీబీ వరకు మాత్రమే ఫైళ్లు షేర్ చేసే అవకాశం ఉండేది. అలాగే, గ్రూప్ అడ్మిన్ ఏ సమయంలోనైనా మెసేజ్లు డిలీట్ చేసే ఫీచర్ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు 'కమ్యూనిటీ' అనే కొత్త ఫీచర్ను తీసుకురానుంది. ఈ ఫీచర్తో ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులందరూ ఒకే వేదికపై కలుసుకోవచ్చు.
ఇదీ చదవండి:వాట్సాప్లో మరో కొత్త ఫీచర్.. ఏమిటంటే?