యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్ చేస్తూ.. కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. అంతేకాదు, తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్‌ఫోన్లకు తన సేవలను నిలిపివేస్తుంది. అలా, కొత్త ఏడాదిలో కూడా కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల 49 స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు వాట్సాప్ సపోర్ట్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. యూజర్లు ఈ మార్పును గమనించాలని కోరింది. జనవరి 1 నుంచి వాట్సాప్ కొత్తగా విడుదల చేసే ఫీచర్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇకపై ఆయా ఫోన్లకు రావని తెలిపింది.
ETV Bharat / science-and-technology
ఇక ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్.. కొత్త ఏడాది నుంచి అమలు - వాట్సాప్ అప్డేట్స్
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, భద్రతాపరమైన లోపాల కారణంగా వాట్సాప్ కొత్త ఏడాది నుంచి స్మార్ట్‌ఫోన్లలో తన సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సుమారు 49 స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
వాట్సాప్ పేర్కొన్న 49 మోడల్స్‌లో ఎక్కువగా పాత వెర్షన్ మొబైల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 5, 5సీతోపాటు శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్‌కవర్ 2, ఏస్2 మోడల్స్ ఉన్నాయి. ఇవికాకుండా హెచ్‌టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్స్‌ఎల్, ఎల్‌జీ ఎనాక్ట్, ఎల్‌జీ లూసిడ్ 2 మోడల్స్‌తోపాటు ఎల్‌జీ ఆప్టిమస్ సిరీస్, సోనీ ఎక్స్‌పిరీయా ఆర్క్ ఎస్, ఎక్స్‌పిరీయా మిరో, ఎక్స్‌పిరీయా నియో ఎల్, ఆర్కోస్ 53 ప్లాటినమ్, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్‌టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్‌టీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్క్‌నైట్ జెడ్‌టీ మోడల్స్‌లో డిసెంబరు 31 తర్వాత వాట్సాప్ పనిచేయదని తెలిపింది.
ఇప్పటికీ ఈ ఫోన్లను ఎవరైనా ఉపయోగిస్తుంటే కొత్త ఫోన్ కొనుగోలు చేయడం లేదా వాట్సాప్ వినియోగం ఆపేయడం మినహా మరో మార్గంలేదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ రిపోర్ట్ అనే ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు ఇతరులు స్టేటస్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా వాట్సాప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.