Whatsapp Status Update On Instagram :ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మాతృసంస్థ అయిన మెటా తమ యూజర్ల కోసం మరో అప్డేట్ తీసుకురానునుంది. వాట్సాప్ యూజర్లు వారి స్టేటస్ అప్డేట్లను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడానికి వీలుగా ఫీచర్ తీసుకువచ్చేందుకు మెటా సంస్థ పనిచేస్తున్నట్లుగా తెలిసింది.
ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులు ఇప్పటికే వారి స్టేటస్ అప్డేట్లను నేరుగా ఫేస్బుక్ స్టోరీస్‌కు షేర్‌చేసే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. తాజాగా మెటా అభివృద్ధి పరుస్తున్న ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌కు విస్తరింప చేస్తుంది. తద్వారా యూజర్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏకకాలంలో రెండు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో వారి స్టేటస్‌ను షేర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదికల ప్రకారం మెటా ఈ ఫీచర్లును మొదట ఆండ్రాయిడ్ బీటాయూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ ఫీచర్లను ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఏ సమయంలోనైనా అందరూ ఉపయోగించే విధంగా తీసుకువచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది.
అయితే మెటా అందుబాటులోకి తీసుకురానున్న ఈ ఫీచర్లు ఉపయోగించాలా వద్దా అనే విషయంపై యూజర్లు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. వాట్సాప్ నుంచి నేరుగా షేర్ చేయడం వల్ల సమయం అవుతుంది. దీంతో పాటు మరింత సమర్థవంతమైన క్రాస్-ప్లాట్‌ఫామ్ షేరింగ్ ప్రక్రియ ఉంది. అయితే ఫొటో, వీడియో ఎడిటింగ్ ఫీచర్లను ఎక్కువ మంది యూజర్లు ఇష్టపడుతుంటారు. నేరుగా వాట్సాప్ నుంచి స్టోరీస్‌ను షేర్ చేసినప్పుడు కొన్ని ఫీచర్లను మిస్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని నివేదిక తెలిపింది.