వాట్సాప్ వరుసగా కొత్త పీచర్లను (watsapp disappearing features) తీసుకొస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మల్టీడివైజ్, పేమెంట్, ఎమోజీ రిప్లై వంటి కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అంతేకాకుండా వాట్సాప్ ప్లేయర్, ఆడియో మెసేజ్ ప్రివ్యూ, కమ్యూనిటీ వంటి మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. అయితే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన తర్వాత దానికి అదనపు మెరుగులు దిద్దడం వాట్సాప్‌కు అలవాటు. తాజాగా డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌ను మరింత మెరుగుపరచనున్నట్లు సమాచారం. వాట్సాప్ గతేడాదే ఈ ఫీచర్స్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ పంపిన తర్వాత ఏడు రోజుల్లో వాటంతటవే డిలీట్ అయిపోతాయి. ఈ ప్రక్రియ జరిగేందుకు యూజర్ వాట్సాప్ ఇన్ఫోలోకి వెళ్లి డిస్‌అప్పిరియంగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి.
త్వరలోనే ఈ ఫీచర్‌లో ఏడు రోజుల ఆప్షన్‌తోపాటు 24 గంటలు, 90 రోజుల ఆప్షన్స్‌ని (watsapp new features 2021) అదనంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అంటే డిస్‌అప్పియరింగ్ ఆప్షన్‌ను ఆన్ చేసిన వెంటనే ఎన్ని రోజులకు డిలీట్ అవ్వాలి అని అడుగుతుందట. అందులో 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సింది ఎంచుకుంటే సరి. అక్కడ 24 గంటలు ఎంచుకుంటే, ఒక రోజులో మెసేజ్‌లు మాయమవుతాయి. అలాకాకుండా 90 రోజులు ఎంచుకుంటే, మూడు నెలల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవుతాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను బీటా యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో అందరికీ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.