WhatsApp Secret Code feature For Chats :ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 'సీక్రెడ్ కోడ్' అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించి మీ పర్సనల్ చాట్లను లాక్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు లాక్ చేసుకున్న చాట్స్ మరెవరికీ కనబడకుండా చేసుకోవచ్చు. దీని వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉంటుందని వాట్సాప్ చెబుతోంది.
లూప్‌హోల్
వాట్సాప్ చాట్లకు లాక్ వేసుకునే వెసులుబాటు ఇంతకు ముందే ఉంది. కానీ దీనిలో ఒక లూప్‌హోల్ ఉంది. అది ఏమిటంటే, సాధారణంగా మన స్మార్ట్ఫోన్లను ఓపెన్ చేయడానికి ఫింగర్ప్రింట్లను ఉపయోగిస్తుంటాం. ఇలా ఫింగర్‌ప్రింట్ ఉపయోగించి స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ చేసుకుంటే.. వాట్సాప్‌లోని ప్రైవేట్ చాట్లను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాం. ఇక్కడి వరకు ఓకే. కానీ ఇతరులు ఎవరైనా మన ఫోన్లో తమ ఫింగర్‌ప్రింట్‌ను రిజిస్టర్ చేసుకుంటే.. ఇక వాళ్లు కూడా మనంవాట్సాప్ ప్రైవేట్ చాట్లను ఓపెన్ చేసి, చదవగలుగుతారు. దీని వల్ల యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుంది.
దీనిని నివారించడానికే వాట్సాప్ తాజాగా సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. అందువల్ల ఇకపై మీరు అక్షరాలు, ఎమోజీలను ఉపయోగించి యూనిక్ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయకుండా మీ ప్రైవేట్ చాట్లను మరెవరూ చూడలేరు. దీనితో మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.
సీక్రెట్ కోడ్ సెట్ చేసుకోవడం ఎలా?
How To Turn On WhatsApp Chat Lock :మీ వాట్సాప్ చాట్లు మరెవరీకి కనిపించకుండా ఉండాలంటే..
- ముందుగా మీరు లాక్ చేసిన చాట్లను ఓపెన్ చేయాలి. తరువాత..
- ఎగువన ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్ చేయాలి.
- చాట్ లాక్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
- Hide Lock Chatsను టర్న్ ఆన్ చేసుకోవాలి. తరువాత..
- మీరు కోరుకున్న సీక్రెట్ కోడ్‌ను సెట్ చేసుకోవాలి. అంతే సింపుల్!