తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో పోల్ ఫీచర్.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? - add poll to WhatsApp chat

వాట్సాప్​లో పోల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లు ఇచ్చే సౌలభ్యాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ పోల్స్ చేసేయండి. ఎలా చేయాలో ఇక్కడ నేర్చేసుకోండి.

WHATSAPP POLL FEATURE
WHATSAPP POLL FEATURE

By

Published : Nov 17, 2022, 4:18 PM IST

వాట్సాప్ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ట్విట్టర్​లో మాదిరిగా పోల్స్ క్రియేట్ చేసే ఆప్షన్​ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుందని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్​ పోల్​లో.. ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఒకే ఆప్షన్ రెండు సార్లు ఇస్తే మాత్రం తీసుకోదని వాట్సాప్ తెలిపింది.

వాట్సాప్​లో పోల్ ఎలా క్రియేట్ చేయాలంటే?

  • ఫోన్​లో లేటెస్ట్ వాట్సాప్ అప్లికేషన్ ఉండేలా చుసుకోవాలి.
  • యాప్ ఓపెన్ చేసి.. వ్యక్తిగత చాట్ లేదా, గ్రూప్ చాట్ తెరవాలి.
  • ఐఓఎస్ యూజర్లు అయితే.. మెసేజ్ బాక్స్ పక్కన ఉన్న ప్లస్ సింబల్​ను నొక్కాలి. ఆండ్రాయిడ్ యూజర్లు.. పేపర్​క్లిప్ సింబల్​ను క్లిక్ చేయాలి.
  • వెంటనే ఒక మెనూ ఓపెన్ అవుతుంది.
  • అందులో చివర్లో పోల్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • 'పోల్' అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే.. కొత్త మెనూ ఓపెన్ అవుతుంది.
  • అనంతరం, పోల్ ప్రశ్నను అడుగుతుంది. దీనికి సమాధానాలు యాడ్ చేయాల్సి ఉంటుంది.
  • సమాధానాల కోసం మొత్తం 12 ఆప్షన్లు ఇవ్వొచ్చు.
  • ఆప్షన్లన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ చేస్తే సరిపోతుంది.
  • పోల్ రిసీవ్ చేసుకున్నవారు ఆన్సర్​పై క్లిక్ చేస్తే.. ఓటు నమోదవుతుంది.

ఏ ఆప్షన్​కు ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఏ ఆప్షన్​ను ఎవరు ఎంచుకున్నారు, ఎంతమంది ఓటేశారనే విషయాలన్నీ కనిపిస్తాయి. వాట్సాప్​లో గ్రూపులు, అందులోని సభ్యుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోల్ ఫీచర్ యూజర్లను ఆకట్టుకుంటుందని వాట్సాప్ భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details