WhatsApp Passkeys Feature :ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ మరో సరికొత్త సెక్యురిటీ ఫీచర్‌తో మొబైల్ వినియోగదారుల ముందుకు వచ్చేసింది. దీని సాయంతో ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు పాస్‌వర్డ్ లేకుండానే ఈజీగా వాట్సాప్‌లోకి లాగిన్ కావచ్చు. 'WhatsApp Passkeys' పేరుతో ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మెటా తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ అప్డేట్ను కొంతమంది యూజర్స్ మాత్రమే అందుబాటులోకి తెచ్చామని.. దశలవారీగా మిగతావారి కోసం కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేస్తామని వాట్సాప్ ప్రకటించింది.
వాట్సాప్ పాస్‌కీస్ అంటే ఏంటి?
వాట్సాప్ పాస్‌కీస్ (WhatsApp Passkeys Feature) ఫీచర్ సాయంతో మీవాట్సాప్ను పాస్‌వర్డ్ లేకుండానే ఓపెన్ చేయవచ్చు. ఇందుకు ఈ నయా ఫీచర్ అనుమతిస్తుంది. అయితే ఈ పాస్కీ అనేది మీ వాట్సాప్ సర్వర్‌కు బదులుగా యూజర్ ఫోన్‌లో స్టోర్ అవుతుంది. మొదటిసారిగా ఈ పాస్‌కీని అన్‌లాక్ చేయడానికి మొబైల్ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ స్కానర్ లేదా ఫోన్ పిన్ను ఉపయోగించవచ్చు.
సాధారణంగా ఫోన్ మార్చినప్పుడు లేదా వాట్సాప్‌ను డిలీట్ చేసి మళ్ళీ రీ-ఇన్‌స్టాల్ చేసినప్పుడు వాట్సాప్ అకౌంట్‌లోకి మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా చేయడానికి మాములుగా మన ఫోన్ నంబర్‌కు SMS ద్వారా వాట్సాప్ పంపే ఓటీపీ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ట్రా సెక్యూరిటీ కోసం ఒక్కోసారి ఆరు అంకెల పిన్ లేదా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(2FA)ను కూడా సెటప్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు వచ్చిన WhatsApp Passkeys అనే సింపుల్ ఫీచర్‌తో ఈ ప్రక్రియ అంతా చేయాల్సిన పని ఉండదు.
గూగుల్ కూడా..
గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇప్పటికే పాస్‌కీస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటి ద్వారా మీ అకౌంట్ చాలా సురక్షితం అవుతుంది. ఎందుకంటే పాస్‌కీలు అనేవి ట్రెడిషనల్ పాస్‌వర్డ్‌ల కంటే చాలా సురక్షితమైనవి. కనుక మీరు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలను పొందగలుగుతారు.