తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్​ నయా ప్రైవసీ ఫీచర్లు.. కొత్త ఫోన్​లోకి మారాలంటే అది మస్ట్!

WhatsApp Security Features : ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అప్డేట్లు తెస్తున్న వాట్సాప్..​ మరిన్ని కొత్త ఫీచర్లతో ముందుకు రాబోతోంది. సైబర్​ దాడులను అరికట్టేందుకు డివైస్ వెరిఫికేషన్‌ ఫీచర్, ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్‌ అనే రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేనునట్లు వాట్సాప్ తెలిపింది.

WhatsApp Implements Additional Security Features to Combat Malware Attacks
WhatsApp Implements Additional Security Features to Combat Malware Attacks

By

Published : Apr 15, 2023, 5:46 PM IST

WhatsApp Security Features : ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్ వాట్సాప్​​.. భద్రతపరంగా కొత్త ఫీచర్లను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. రోజురోజుకు సైబర్​ నేరాలు పెరుగుతున్న దృష్టా.. అదనపు సెక్యూరిటీ ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. కంపెనీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో వినియోగదారులకు లాభం చేకూరినప్పటికి.. కాస్త ఇబ్బంది ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

డివైస్ వెరిఫికేషన్‌ ఫీచర్..
వాట్సాప్​ను మాల్​వేర్ దాడుల నుంచి కాపాడేందుకు.. ఈ డివైస్ వెరిఫికేషన్‌ ఫీచర్​ను తీసుకువస్తున్నట్లు సంస్థ తెలిపింది. కొత్త డివైస్​లో తమ వాట్సాప్​ అకౌంట్​ను తెరవాలంటే పాత డివైస్​ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పాత డివైజ్​లోని వాట్సాప్​ దాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అంటే కొత్త డివైజ్​లో యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు.. తమ పాత ఫోన్‌లను కూడా ఆన్ చేయాల్సి ఉంటుంది. దీంతో యూజర్​కు తెలియకుండా.. మరెవరూ తన వాట్సాప్​ను ఓపెన్​ చేయలేరు. ఈ ఫీచర్​ దాడి చేసే వ్యక్తి కనెక్షన్‌ను బ్లాక్ చేస్తుంది. సైబర్​ నేరగాళ్ల నుంచి వినియోగదారుని కాపాడి.. వారి ఖాతాను అంతరాయం లేకుండా ఉపయోగించేందుకు దోహదపడుతుంది.

అకౌంట్​ టేకోవర్ దాడుల నుంచి ఈ ఫీచర్​ రక్షణ కల్పిస్తుందని వాట్సాప్ వెల్లడించింది. వినియోగదారుని భద్రతను పెంచేందుకే.. డివైస్ వెరిఫికేషన్‌ ఫీచర్​ను అమలు చేస్తునట్లు పేర్కొంది. కాగా కంపెనీ తెస్తున్న తాజా ఫీచర్​తో వినియోగదారులకు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది తప్పకపోవచ్చు. పాత మొబైల్ లేని పరిస్థితుల్లో ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్‌ ఫీచర్​..
డివైస్ వెరిఫికేషన్ ఫీచర్‌తో పాటు, మరో ఫీచర్​ను కూడా తీసుకువస్తున్నట్లు వాట్సాప్​ ప్రకటించింది. వినియోగదారులు తాను ఉద్దేశించిన వారితోనే చాట్ చేస్తున్నారా లేదా? అని నిర్ధరించుకోవడానికి వాట్సాప్ ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్​ వినియోగదారులు.. సురక్షితమైన కనెక్షన్‌ను కలిగి ఉండే విధంగా ఆటోమెటిక్​ వెరిఫికేషన్​కు అనుమతినిస్తుందని పేర్కొంది. ఎన్‌క్రిప్షన్ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సంభాషణల భద్రతను ధ్రువీకరించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఒకటే నంబర్.. 4 ఫోన్లలో వాట్సాప్​..
వాట్సాప్ ఇదివరకు 'కంపానియన్​ మోడ్​' అనే ఫీచర్​ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు నాలుగు డివైజ్​లలో వాట్సాప్​ను వాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్​, ట్యాబ్లెట్‌ లేదా ఇతర డివైజ్​లలో కంపానియన్ మోడ్ వల్ల వాట్సాప్​ను వాడుకోవచ్చని WABetaInfo పేర్కొంది. ఆ నంబర్​తో ఏ డివైజ్​లో నుంచైనా చాట్​ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైమరీ ఫోన్​లో ఇంటర్నెట్​ లేకపోయినా మిగతా డివైజ్​లకు మేసేజ్​లు వస్తాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details