తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాయిస్​ మెసేజ్​ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్​

ఇప్పటికే వాయిస్‌ మెసేజ్‌లను విభిన్న వేగాల్లో వినేలా ఓ కొత్త ఫీచర్‌ను (whatsapp new feature) వినియోగదారులకు పరిచయం చేసింది వాట్సాప్. ఇప్పుడిది ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. తాజాగా మరో వినూత్న ఫీచర్ 'గ్లోబల్‌ వాయిస్‌ మెసేజ్‌ ప్లేయర్‌'ను అభివృద్ధి చేయడంపై వాట్సాప్‌ దృష్టి పెట్టింది.

whatsapp new feature
వాట్సప్ కొత్త ఫచర్లు

By

Published : Oct 7, 2021, 1:37 PM IST

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'వాట్సాప్‌' వాయిస్‌ మెసేజ్‌లకు (watsapp voice features) సంబంధించి నూతన ఒరవడికి (whatsapp new feature) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వాయిస్‌ మెసేజ్‌లను విభిన్న వేగాల్లో వినేలా ఓ కొత్త ఫీచర్‌ను (new features in watsapp) వినియోగదారులకు పరిచయం చేసింది. ఇప్పుడిది ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. తాజాగా మరో వినూత్న ఫీచర్ 'గ్లోబల్‌ వాయిస్‌ మెసేజ్‌ ప్లేయర్‌'ను అభివృద్ధి చేయడంపై వాట్సాప్‌ దృష్టి పెట్టింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఇదెలా పనిచేస్తుందంటే..?

ఇప్పటివరకు వాట్సాప్‌లో వచ్చిన వాయిస్‌ మెసేజ్‌లను వినాలంటే పంపిన వ్యక్తి లేదా అదే గ్రూప్‌ చాట్‌లోనే ఉండాలి. ఈ సరికొత్త ఫీచర్‌తో ఇకపై నిర్దిష్ట చాట్‌ విండోను విడిచిపెట్టి మరీ వాయిస్‌ మెసేజ్‌లను వినడానికి వాట్సాప్‌ అనుమతిస్తుంది. ఈ మేరకు యాప్ పైభాగంలో వాయిస్‌ మెసేజ్‌ పిన్‌ చేసుకోవాలి. యాప్‌లోని ఏ విభాగాన్ని తెరిచినా వాయిస్‌ మెసేజ్‌ పైనే కనిపిస్తుంది. దీంతో అవసరమైనప్పుడు వాయిస్‌ మెసెజ్‌ను పాజ్‌ లేదా డిస్మిస్‌ చేసుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే సుదీర్ఘ వాయిస్ మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిని వింటూనే ఇతర కాంటాక్ట్‌లతో చాట్‌ చేసుకోవచ్చన్న మాట. అంతేకాకుండా 'పిక్చర్-ఇన్-పిక్చర్' మాదిరి ఇతర యాప్‌లలోనూ 'గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్' పనిచేస్తుందట.

అయితే, ఇప్పటివరకు ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ ఆధారిత వినియోగదారులకు కోసమే తయారుచేస్తున్నారట. ఆండ్రాయిడ్ వారి కోసం బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టాలని వాట్సాప్‌ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు 'వాట్సాప్‌ వేవ్‌ఫార్మ్‌' పేరు తీసుకొస్తున్న మరో ఫీచర్‌తో వాయిస్‌ మెసేజ్‌ను ముందే రికార్డు చేసి అందులో ఏవైనా మార్పులు ఉంటే డిలేట్‌ చేయొచ్చు. ఆపై కొత్త మెసేజ్‌ను రికార్డు చేసి పంపవచ్చు. అలాగే 'డిసప్పియరింగ్‌ మెసెజ్‌', 'డిఫాల్ట్ మెసేజ్ టైమర్ల'కు వాట్సాప్‌ మెరుగులు దిద్దనున్నట్లు వినికిడి. ఇలా ఎప్పటికప్పుడు సమాచార మార్పిడిని మరింత మెరుగ్గా, సరికొత్తగా తీర్చిదిద్దుతోంది వాట్సాప్‌.

ఇదీ చదవండి:గూగుల్​ సెర్చ్​లో ఫలితం కచ్చితంగా రావాలంటే?

ABOUT THE AUTHOR

...view details