Whatsapp Video Call Screen Sharing Feature : ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకువస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్ యూజర్లకు పరిచయం చేసేందుకు వాట్సాప్ సిద్ధమైంది. కుటుంబసభ్యులకు, స్నేహితులకు వీడియో కాల్ చేసేందుకు.. చాలా మంది వాట్సాప్‌నే ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీడియో కాల్ మాట్లాడే సమయంలో స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే ప్రవేశపెట్టనుంది. దీంతో వీడియో కాల్ విషయంలో చాలా కాలంగా వినియోగదారులు కోరుకుంటున్న కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది. అయితే ఆండ్రాయిడ్ వెర్షన్లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుందా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. వీడియో కాల్ మాట్లాడుతుండగా.. కాల్ కంట్రోల్లో కొత్తగా తీసుకువచ్చిన సింబల్‌పై క్లిక్ చేయడం ద్వారా స్క్రీన్ షేరింగ్ చేయవచ్చని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు.
ETV Bharat / science-and-technology
వీడియో కాల్లో స్క్రీన్ షేరింగ్.. వాట్సాప్‌లో సూపర్ ఫీచర్! - వాట్సాప్ వీడియో కాల్ ఫీచర్
Whatsapp Video Call Screen Sharing Eeature : వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. వీడియో కాల్ చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం.
వాట్సాప్ ప్రవేశపెట్టబోయో ఈ కొత్త ఫీచర్లో వీడియో కాల్ మాట్లాడుతుండగానే.. మన మొబైల్ స్క్రీన్‌ను అవతలి వారికి షేర్ చేయవచ్చు. చెల్లింపుల వివరాలు, ఫొటోలు, మెస్సేజ్‌లు, వంటి వాటిని వీడియో కాల్‌లోనే.. వారికి చూపించవచ్చు. ఆడియో సైతం వినిపించవచ్చు. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గుగూల్ మీట్ వంటి ఇతర యాప్‌లలో.. వీడియో కాల్ స్క్రీన్ షేరింగ్ సదుపాయం చాలా కాలంగా ఉంది. అదే తరహాలో ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ వీడియో కాల్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకువస్తోంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుకునే సందర్భాల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారికి మొబైల్లో ఉన్న పొటోలు, ఇతర సమాచారం చూపించేందుకు తోడ్పడుతుంది.
వాట్సాప్‌లో మెసేజ్ ఎడిట్ ఫీచర్ 15 నిమిషాల్లోపే ఛాన్స్ ఆ తర్వాత..
వాట్సాప్ ఇటీవలె ఓ కొత్త అప్డేట్ను యూజర్ల కోసం తీసుకువచ్చింది. అదే ఎడిట్ మెసేజ్ ఫీచర్. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు టైప్ చేస్తుంటే అక్షర దోషాలు వస్తుంటాయి. అవి చూసుకోకుండా సెండ్ బటన్ మీద క్లిక్ చేసి మనం పంపించేస్తాం. ఆ తర్వాత చూసుకుని అరెరే పెద్ద సమస్య వచ్చి పడిందే అని డిలీట్ చేయడమో లేక దాని తర్వాత సరిచేసి వేరే మెసేజ్ టైప్ చేసి పంపుతాం. అదే మెసేజ్ కాస్త పెద్దదైతే మళ్లీ టైప్ చేయలేక కాపీ చేసి దాన్నే సరిచేసి పంపుతాం. ఇంత ప్రాసెస్ అవసరమా? అదే మెసేజ్‌ను ఎడిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంటుంది. అయితే పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పొరపాటున తప్పుగా మెసేజ్ పంపినా ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.