తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఒకటే నంబర్.. 4 ఫోన్లలో వాట్సాప్​.. కొత్త ఫీచర్ వాడడం ఇలా.. - ఒకేసారి నాలుగు డివైజ్​లలో వాట్సాప్

సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను ఆకట్టుకోవడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ మెసేజింగ్ మరో కొత్త ఫీచర్​ను యూజర్లకు పరిచయం చేసింది. ఇక నుంచి వాట్సాప్​ను ఒకేసారి నాలుగు డివైజ్​లలో వాడుకోవచ్చు. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన కంపానియన్​ మోడ్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

whatsapp companion mode
whatsapp companion mode

By

Published : Apr 13, 2023, 11:51 AM IST

తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్. ఇప్పుడు​ కొత్తగా 'కంపానియన్​ మోడ్​' అనే ఫీచర్​ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకే నంబరుతో నాలుగు డివైజ్​లలో వాట్సాప్​ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఈ కంపానియన్ మోడ్​ వల్ల యూజర్లు.. నాలుగు డివైజ్​లలో వాట్సాప్​ను వాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్​, ట్యాబ్లెట్‌ లేదా ఇతర డివైజ్​లలో కంపానియన్ మోడ్ వల్ల వాట్సాప్​ను వాడుకోవచ్చని WABetaInfo పేర్కొంది. ఆ నంబర్​తో ఏ డివైజ్​లో నుంచైనా చాట్​ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైమరీ ఫోన్​లో ఇంటర్నెట్​ లేకపోయినా మిగతా డివైజ్​లకు మేసేజ్​లు వస్తాయని వెల్లడించింది.

ప్రస్తుతానికి కంపానియన్‌ మోడ్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ ఫీచర్‌ కోసం యూజర్లు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. కంపానియన్‌ మోడ్‌ అందుబాటులోకి వస్తే ఫోన్​లో ఛార్జింగ్ లేకపోయినా ఫర్వాలేదు. ఒకవేళ ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ఛాప్ అయినా మిగతా డివైజ్​లలో వాట్సాప్​ను వాడుకోవచ్చు. మల్టీడివైజ్‌ ఫీచర్‌ వల్ల ఒక మొబైల్‌ ఫోన్‌తో పాటు పర్సనల్‌ కంప్యూటర్‌ లేదా ట్యాబ్లెట్‌లో వాట్సాప్‌ను వాడేందుకు వీలుంది. అదీ ప్రైమరీ డివైజ్‌లో ఇంటర్నెట్‌ లేకున్నా సరే.

మరో డివైజ్​కు ఇలా లింక్​ చేయండి..

  • మరో స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా డివైజ్​లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి వాట్సాప్‌ మెసెంజర్‌ లేదా వాట్సాప్‌ బిజినెస్‌ లేటెస్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి.
  • రిజిస్ట్రేషన్‌ స్క్రీన్‌లో కనిపించే ఓవర్‌ఫ్లో మెనూపై క్లిక్‌ చేయాలి. అందులో 'లింక్‌ ఏ డివైజ్‌' అనే ఆప్షన్‌ ఉంటుంది.
  • ప్రైమరీ డివైజ్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్డ్‌ డివైజెస్‌'పై క్లిక్‌ చేయాలి.
  • మరో డివైజ్​ లేదా ఫోన్​లో ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసేలా ప్రైమరీ డివైజ్‌ను ఉంచాలి.
  • ఇలా మొదటి ఫోన్‌లో లాగౌట్‌ కాకుండానే మిగతా డివైజ్​లలోనూ వాట్సాప్‌ను వాడొచ్చు.

వాట్సాప్ అప్లికేషన్​లోని కాంట్రాక్ట్స్ యాడ్​, ఎడిట్..
వాట్సాప్ అప్లికేషన్​లోనే కాంటాక్ట్స్ క్రియేట్​, ఎడిట్​ చేసుకునే సదుపాయాన్ని ఆండ్రాయిడ్​ బీటా వెర్షన్​ యూజర్లకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. గతంలో వాట్సాప్ యూజర్లు ఏదైనా కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలంటే ఫోన్ కాంటాక్ట్స్‌ యాప్​నకు వెళ్లి సంబంధిత డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త ఫీచర్‌తో ఆ భారం తప్పుతుంది. నిజానికి వాట్సాప్‌లో ఫలానా కాంటాక్ట్ సేవ్ చేసుకోవడానికి ఒక షార్ట్‌కట్ ఉంది. అయితే ఈ షార్ట్‌కట్‌పై క్లిక్ చేయడం ద్వారా అది ఫోన్ కాంటాక్ట్స్‌ యాప్‌కి తీసుకెళ్తుంది. దీనివల్ల ఫోన్‌పై రెండు అప్లికేషన్లు ఓపెన్ చేయాల్సిన భారం పడుతుంది. అలాగే యూజర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details