తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్​ మోసగాళ్లకు చెక్​.. ఇకపై అలాంటి కాల్స్​ బంద్​!

Whatsapp New Features 2023 : త‌మ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఉండ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్​లో ఇది ప్ర‌ధానమైనది. వాట్సాప్​ సైతం తమ యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. తాజాగా మరో రెండు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

whatsapp-new-features-2023-whatsapp-admin-review-feature
వాట్సాప్ కొత్త ఫీచర్లు 2023

By

Published : May 9, 2023, 7:06 AM IST

Updated : May 9, 2023, 9:22 AM IST

Whatsapp New Features 2023 : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్లు తీసుకువస్తునే ఉంటుంది. కాలానుగుణంగా, వినియోగ‌దారుల అభిరుచికి త‌గ్గ‌ట్లుగా మార్పులు చేర్పులు చేస్తూ వ‌స్తోంది. ఇప్పటికే పలు ఫీచర్లను ప్రవేశపెట్ట‌గా.. తాజాగా మరో రెండింటిని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై గ్రూపుల్లో వచ్చే అనుచిత మెసేజ్​లపై రిపోర్టు చేయడం, అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్ సైలెంట్​గా ఉంచే వీలు కల్పించేలా వాటిని రూపొందించింది.

వాట్సాప్ వెబ్ ఇన్ఫో వివరాల ప్రకారం..అడ్మిన్ రివ్యూ అని పిలిచే ఈ ఫీచర్ లో.. గ్రూపుల్లో ఎవరైనా అనుచిత మెసేజులు పంపిస్తే.. దాన్ని ఆ గ్రూపు అడ్మిన్​కు ఫిర్యాదు చేయవచ్చు. సభ్యులు ఒక నిర్దిష్ట సందేశాన్ని అనుచితంగా, అసభ్యకరంగా ఫిర్యాదు చేసిన‌ప్ప‌డు.. అది సమీక్ష నిమిత్తం అడ్మిన్​​కు ఫార్వార్డ్ అవుతుంది. అది అభ్యంత‌క‌ర‌మ‌ని భావిస్తే అప్పుడు అడ్మిన్ దాన్ని తొలగించవచ్చు. ఈ నూతన ఫీచర్ గ్రూపు పేజీల సెట్టింగ్స్​లో ఉంది. పైగా దీన్ని ఆ గ్రూపు అడ్మిన్లు మాత్రమే ఎనేబుల్ చేసే అవకాశముంది.

దీంతో పాటు డెవలపర్లు మరో ఫీచర్ పైనా వర్క్ చేస్తున్నారు. అనుచిత, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్​ను సైలెంట్​లో ఉంచేందుకు వీలుగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది వాట్సాప్ సెట్టింగ్స్​లోని ప్రైవసీ సెక్షన్​లో ఉంటుంది. ఎవరికైనా తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు వినియోగదారులు వాటిని మ్యూట్ చేసుకోవచ్చు. కానీ.. ఆ కాల్స్ నోటిఫికేషన్​లో కనిపిస్తుంది.

ఈ రెండు ఫీచర్లలో.. గ్రూపుల్లో వచ్చే అనుచిత మెసేజులపై ఫిర్యాదు చేసే ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని మరింత మంది వినియోగదారులకు అందించాలని డెవలపర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రెండోదైన అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్​ను మ్యూట్ చేసే ఫీచర్.. వాట్సాప్ తాజా వెర్షన్​లో బీటా వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంది.

కొన్ని రోజుల క్రితమే మొత్తం వాట్సాప్​కే లాక్ వేయకుండా.. మనకు కావాల్సిన చాట్​లకు లాక్ వేసుకునే ఫీచర్​ను తీసుకురావాలని ప్రయోగాలు చేపట్టింది. వారం రోజుల క్రితం పోల్ ఫీచర్​లో కొత్త ఫంక్షనాలిటీలు, ఫొటోలు, డాక్యుమెంట్లు క్యాప్షన్లతో పాటు ఫార్వార్డ్ చేయడం లాంటివి తెచ్చింది. వినియోగదారుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని.. వారు పంపే సందేశాల‌ను థర్డ్​ పార్టీ చ‌ద‌వ‌కుండా ఎండ్ టు ఎండ్ ఇన్ క్రిప్ష‌న్ సౌక‌ర్యాన్ని తెచ్చింది.

Last Updated : May 9, 2023, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details