వాట్సాప్.. ఎంతో ప్రాచుర్యం పొందిన సామాజిక మాధ్యమం. క్షణాల్లోనే సమాచారాన్ని చేరవేసే యాప్‌లలో ముందు వరుసలో ఉంటుందీ యాప్. దీనిని చాలా మంది తమ వ్యక్తిగత వినియోగం కోసమే కాకుండా వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఎక్కువగా వాడుతున్నారు. 100 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది వాట్సాప్. ప్రస్తుతం వాట్సాప్ అందిస్తున్న ఫీచర్స్ వాడకంతో మన స్నేహితులు, బంధువులకు మరింత దగ్గరవ్వచ్చు. దీంతో పాటు వాట్సాప్‌లో లేని మరి కొన్ని సౌకర్యాలు కూడా దీనికి జోడిస్తూ పలు యాప్‌లు వాట్సాప్ యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్ వాడకాన్ని మరింతగా మెరుగుపరిచే ఆ టాప్ ఐదు యాప్‌లు ఏమిటంటే..
టాప్ 5 యాప్స్ ఇవే..!
1. వాట్సాప్ ఆటో రిప్లై
వాట్సాప్ ఆటో రిప్లై సౌకర్యం వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చే సందేశాలకు స్పందిస్తూ తరచూ టైప్ చేయకుండా.. ముందుగానే టైప్ చేసి పెట్టుకున్న మెసేజ్‌లను పంపవచ్చు. దీంతో అవతలి వ్యక్తికి ప్రస్తుతం మీరు బిజీగా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. అంతేగాక అవతలి వ్యక్తి సమయం వృథా కాకుండా ఉంటుంది. కాకపోతే ఈ సేవలు కేవలం వాట్సాప్ బిజినెస్ యాప్‌లో మాత్రమే కనిపిస్తాయి.
2. వాట్సాప్ కాల్ బ్లాకర్
మాములుగా వాట్సాప్‌లో ఎవరినైనా బ్లాక్ చేయాలంటే బ్లాక్ ఆప్షన్‌ను వాడతాం. దీంతో అవతలి వ్యక్తిని బ్లాక్ చేశామన్న విషయం వారికి ఇట్టే తెలిసిపోతుంది. అయితే మనం ఇతరులని బ్లాక్ చేసిన తర్వాత వాళ్లు మనకు తరచూ మెసేజ్ లేదా వాయిస్, వీడియో కాల్స్ చేస్తుంటారు. కానీ వారిని బ్లాక్ చేయడం వల్ల అవి మనకు తెలిసే అవకాశం లేదు. దీనికి సరైన పరిష్కారం వాట్సాప్ కాల్ బ్లాకర్. ఈ సాఫ్ట్‌వేర్‌తో అవతలి వ్యక్తి మనతో ఎన్ని సార్లు మాట్లాడటానికి ప్రయత్నించాడో కాల్ లాగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సౌలభ్యం వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది.