ఫ్రెండ్‌తో గొడవైందా? కానీ.. అతడు/ఆమె పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూడాలని ఉందా? అది కూడా వారికి తెలియకుండా! ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.
వాట్సాప్ స్టేటస్ చూసేందుకు నాలుగు మార్గాలు..
ఇన్‌కాగ్నిటో మోడ్ ఆన్
ఒక వేళ మనం డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్నట్లయితే ఆ లింక్‌ను ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఓపెన్ చేయండి. దీని వల్ల మీరు ఆ వ్యక్తి వాట్సాప్ స్టేటస్ చూసినట్లు వారికి తెలియదు.
ఆఫ్‌లైన్‌లో వాట్సాప్ స్టేటస్
వాట్సాప్ ఓపెన్ చేయండి. స్టోరీస్ అన్నీ లోడ్ అయ్యేందుకు కాసేపు వేచి చూడండి. తర్వాత నెట్ ఆఫ్ చేసి మీకు కావాల్సిన వ్యక్తి స్టేటస్ చూడండి. ఇలా చేస్తే మీ వ్యూ ఆ స్టేటస్ కింద రికార్డ్ అవ్వదు.