తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్ లేటెస్ట్​ ఫీచర్​.. ఇకపై మెసేజ్​ను నచ్చినంత సమయం పిన్ చేసుకోవచ్చు! - వాట్సాప్​ మెసేజ్​ పిన్​ ఫీచర్​

WhatsApp new feature : ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ మరో సరికొత్త ఫీచర్​ను తీసుకురానుంది. వాట్సాప్​ చాట్స్​లో, గ్రూప్స్​లో మెసేజ్​ను పిన్​ చేసుకునే వెసులుబాటు కల్పించడం సహా, ఎంత సమయం పిన్​ చేసి ఉంచుకోవాలో కూడా యూజర్లే నిర్ణయించుకునే విధంగా 'మెసేజ్​ పిన్ డ్యూరేషన్​' ఫీచర్​ను తీసుకువస్తోంది. పూర్తి వివరాలు మీరే చూడండి.

WhatsApp new feature
WhatsApp new feature message pin duration

By

Published : Jun 26, 2023, 12:27 PM IST

WhatsApp new feature : వాట్సాప్​ యూజర్లకు గుడ్​ న్యూస్​. త్వరలో 'మెసేజ్​ పిన్​ డ్యూరేషన్​' ఫీచర్​ను తీసుకొచ్చేందుకు వాట్సాప్​ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఒక చాట్​లో లేదా గ్రూప్​లో ఒక మెసేజ్​ను పిన్​ చేసుకునే వెసులుబాటు కల్పించడం సహా, ఎంత సేపు పిన్​ చేసి ఉంచుకోవాలో యూజర్లు నిర్ణయించుకోగలుగుతారు. దీని ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని హైలెట్​ చేయడానికి, ఫ్యూచర్​ రిఫరెన్స్ కోసం దాచుకోవడానికి వీలవుతుంది.

వాట్సాప్​ లేటెస్ట్ ఫీచర్స్​
WhatsApp message pin duration feature :మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్​ను అందుబాటులోకి తెస్తూ, తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా మెసేజ్ పిన్​ డ్యూరేషన్ ఫీచర్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న ఈ ఫీచర్​ను.. వాట్సాప్​ బీటా ఆండ్రాయిడ్​ 2.23.13.11 అప్​డేట్​లో ఉంచింది. వాట్సాప్​ త్వరలో సాధారణ యూజర్లకు కూడా దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉందని డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది.

మెసేజ్ పిన్​ చేసుకునే వెసులుబాటు
వాట్సాప్​ అభివృద్ధి చేస్తున్న ఈ నయా ఫీచర్​ కనుక అందుబాటులోకి వస్తే, యూజర్లు వాట్సాప్​ చాట్​లో, గ్రూప్​లో నిర్దిష్ట సమయం వరకు మెసేజ్​ను పిన్​ చేసుకోవచ్చు. ఆ సమయం తరువాత ఆటోమేటిక్​గా ఆ మెసేజ్​ అన్​పిన్​ అయిపోతుంది.

పిన్​ డ్యూరేషన్​ సమయం!
డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, ఈ సరికొత్త ఫీచర్​ ద్వారా పిన్ మెసేజ్​​ డ్యూరేషన్​ 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వ్యవధి ఉండేలా వాట్సాప్​ ఆప్షన్స్​ ఇవ్వనుంది. దీనితోపాటు నిర్ణీత సమయం కంటే ముందుగానే ఆ మెసేజ్​ను అన్​పిన్​ చేసుకునే అవకాశం కూడా యూజర్లకు కల్పించనుంది. దీని వలన మెసేజ్​లు పిన్​ చేసుకునే విషయంలో యూజర్లకు పూర్తి స్వేచ్ఛ, వెసులుబాటు లభిస్తుంది.

వాట్సాప్​ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్​ వల్ల యూజర్లు ముఖ్యమైన సమాచారాన్ని చాట్స్​లో, గ్రూప్స్​లో పంచుకోవడానికి వీలవుతుంది. అలాగే ముఖ్యమైన ప్రకటనలను చాట్​ బాక్స్ టాప్​లో పిన్​ చేయడానికి వీలవుతుంది. దీని వల్ల చెప్పాలనుకున్న ముఖ్యమైన సమాచారం ఇతర మెసేజ్​ల మధ్య కనుమరుగై పోకుండా ఉంటుంది.

ఈ నయా వాట్సాప్​ ఫీచర్​లోని టైమ్​ ఎలాప్సెస్​ వలన నిర్దిష్ట సమయం తరువాత పిన్​ చేసిన మెసేజ్​ అన్​పిన్​ అయిపోతుంది. ఇది మన చాట్​ను ఒక పద్ధతిగా, అప్​ టూ డేట్​గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.​ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్​ త్వరలోనే బీటా యూజర్లకు, తరువాత అందరు వాట్సాప్​ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

అప్​కమింగ్​ వాట్సాప్​ ఫీచర్స్​
Upcoming WhatsApp Features : త్వరలో వాట్సాప్​లో మరిన్ని కొత్త ఫీచర్స్​ తెచ్చేందుకు మెటా సన్నాహాలు చేస్తోంది. మెసేజ్​ డిస్​అపీయరింగ్ మోడ్, వ్యూ ఒన్స్​ అండ్​ మల్టీ డివైజ్​ ఫీచర్స్​ను త్వరలో బీటా యూజర్లకు అందించనుంది. అలాగే వాట్సాప్​ పైభాగంలో డార్క్​ కలర్​ బార్​ కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details