WhatsApp new feature: వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది వాట్సాప్. ఇన్‌స్టాగ్రాంలో ఉన్న ఫీచర్‌ను తమ యూజర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఇతరుల స్టేటస్ చూడాలంటే చాట్స్ పక్కన స్టేటస్ అనే ప్రత్యేక ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తేనే ఇతరుల స్టేటస్ అప్డేట్లు కనిస్తుంటాయి. ఇప్పుడు రానున్న కొత్త ఫీచర్లో డైరెక్ట్‌గా చాట్ లిస్ట్‌లోనే ఇతరుల స్టేటస్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ తరహా ఫీచర్ ఇన్స్టాగ్రాంలోనే ఉంది. త్వరలోనే వాట్సాప్‌లోనూ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ ప్రయోగ దశలో ఉంది.
గ్రూప్ కాలింగ్‌లో మ్యూట్:గ్రూప్ కాలింగ్‌లో కొత్తగా మ్యూట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. అడ్మిన్ ఇకపై ఇతరులు మాట్లాడేది వినిపించకుండా మ్యూట్ చేయవచ్చు. అలాగే అప్పటికే ప్రారంభమైన గ్రూప్ కాల్లో సభ్యులు ఎవరైనా కొత్తగా చేరితే నోటిఫికేషన్ కూడా కనిపించనుంది. అంతేకాకుండా గ్రూప్ కాల్ సమయంలో ఇతరులకు మెసేజ్ చేసే ఆప్షన్ కూడా రానుంది.