తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. పాత మెసేజ్‌ల సెర్చ్‌ ఇక మరింత ఈజీ! - వాట్సాప్ సర్వే

Whatsapp Message Search: సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్​ను యూజర్లకు పరిచయం చేయనుంది. చాట్ పేజీలో అవసరమైన మెసేజ్​లను సులువుగా వెతికేందుకు కొత్త ఆప్షన్​ను తీసుకురానుంది. ప్రస్తుతం టెక్ట్స్​తో సెర్చ్​ చేస్తుండగా.. ఇకపై డేట్​తో సెర్చ్ చేయొచ్చని తెలుస్తోంది.

whatsapp
వాట్సాప్

By

Published : Sep 13, 2022, 12:48 PM IST

Whatsapp Message Search: వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. చాట్‌ పేజీలో అవసరమైన మెసేజ్‌లను సులువుగా వెతికేందుకు వీలుగా కొత్త సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం టెక్ట్స్‌తో సెర్చ్‌ చేసినట్లుగా, ఇకపై యూజర్లు డేట్‌తో సెర్చ్‌ చేయొచ్చు. దీంతో యూజర్లు తేదీల వారిగా వచ్చిన మెసేజ్‌లను ఫిల్టర్‌ చేసి చూడొచ్చు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లకు సెర్చ్‌ బార్‌పై క్లిక్ చేస్తే క్యాలెండర్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే క్యాలెండర్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో తేదీపై టాప్‌ చేస్తే ఆ రోజు వచ్చిన మెసేజ్‌లు చాట్‌ పేజీలో కనిపిస్తాయి. అలా కిందకు స్క్రోల్‌ చేస్తూ తర్వాతి, ముందు రోజు మెసేజ్‌లను కూడా యూజర్‌ చూడొచ్చు. దీనివల్ల యూజర్‌ ఏ రోజు ఏయే మెసేజ్‌లు పంపారనే వివరాలతో పాటు, మెసేజ్‌ సెర్చింగ్ సులువుగా ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో యూజర్లకు పరిచయం చేయనుంది. డేట్ సెర్చ్‌ ఫీచర్‌తోపాటు 'వాట్సాప్ సర్వే' పేరుతో మరో కొత్త ఫీచర్‌ కూడా యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వాట్సాప్‌ ఫీచర్లు, సర్వీస్‌ గురించి యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు.

యాప్‌ వినియోగం గురించి తమ అభిప్రాయాలు తెలియజేయమని కోరుతూ వాట్సాప్ తన వెరిఫైడ్ ఖాతా నుంచి యూజర్లకు ఇన్విటేషన్‌ పంపుతుంది. దాన్ని ఓపెన్‌ చేసి యూజర్లు సర్వేలో పాల్గొంటూ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయొచ్చు. ఒకవేళ సర్వేలో పాల్గొనకూడదనుకుంటే వాట్సాప్‌ పంపిన ఇన్విటేషన్‌ను రిజెక్ట్ చేస్తే సరిపోతుంది.

ఇవీ చదవండి:ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై కాల్స్‌లో ఆ ఇబ్బందులు ఉండవ్!

ఐఫోన్​, ఐమ్యాక్​, ఐపాడ్.. యాపిల్​ ఉత్పత్తుల పేర్లన్నీ 'ఐ'తోనే ఎందుకు?​

ABOUT THE AUTHOR

...view details