WhatsApp Latest Update 2023 : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో వినియోగదారులకు మరింత చేరువవుతోంది. ఈసారి.. సెర్చ్ బార్‌ను రీడిజైన్ చేసి మరికొన్ని ఫీచర్స్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది వాట్సాప్. తాజా ఫీచర్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.16.5 వారికి మాత్రమే అందుబాటులో ఉందని.. భవిష్యత్‌లో దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోందని వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్లను పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo నివేదించింది.
WhatsApp Beta New Update : వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడమే కాకుండా మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడమే లక్ష్యంగా ఈ రీడిజైన్ అప్డేట్ను తెచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే తాజా అప్డేట్ కేవలం యాప్ పైభాగంలో ఉండే సెర్చ్ బార్‌కు మాత్రమే పరిమితం కాదని.. చాటింగ్ హిస్టరీని వెతికి పెట్టే యాప్‌లోని సెట్టింగ్స్‌లో ఉండే సెర్చ్ ఆప్షన్లోనూ ఈ అప్డేట్ తెచ్చినట్లు వాట్సాప్ తెలిపింది.
WhatsApp Latest Version : ఈ సరికొత్త అప్డేట్లో కొందరు బీటా టెస్టర్లు మరొక ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు. అదేంటంటే.. వాట్సాప్ తెరవగానే కనిపించే సెర్చ్ బార్‌లోని అన్రెడ్, ఫొటోలు, వీడియోలు, లింక్స్ వంటి ఆప్షన్లు ఇప్పుడు కొత్తగా తెలుపు రంగులో కనిపిస్తున్నాయి. ఇది యాప్ విజువలైజేషన్‌ను మరింతగా మెరుగుపరుస్తుందని బీటా టెస్టర్లు అంటున్నారు.