WhatsApp Latest Feature 2023 : వాట్సాప్ తన యూజర్ల కోసం మరో అదిరిపోయే (WhatsApp Multi account feature) ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు ఒకే యాప్‌లో.. రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను వినియోగించుకునే విధంగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
క్లోనింగ్ యాప్స్‌తో పనిలేదు!
WhatsApp cloning apps : ఇప్పటి వరకు యూజర్లు ఒక ఫోన్లో కేవలం ఒకే వాట్సాప్ ఖాతాను వినియోగించుకోగలుగుతున్నారు. లేదంటే.. క్లోనింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. దీని వల్ల భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే కొందరు కొందరు రెండు వాట్సాప్ ఖాతాలను యాక్సెస్ చేసేందుకు రెండు ఫోన్లు ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ ఇబ్బందికి చెక్ పెడుతూ వాట్సాప్ ఈ సరికొత్త (WhatsApp Multi account feature) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో యూజర్లు ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు వేర్వేరు ఖాతాలను నిర్వహించుకోవచ్చు.
ఒకే యాప్‌లో రెండు ఖాతాలు
WhatsApp Multi account feature :వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వారు.. తమ వాట్సాప్ ఖాతాలో క్యూఆర్ కోడ్ ఆప్షన్ వద్ద యారో (బాణం) గుర్తు సాయంతో మరో అకౌంట్‌ని యాడ్ చేసుకోవచ్చు. అంటే రెండు వాట్సాప్ ఖాతాల మధ్య చాలా సులభంగా స్విచ్ కావచ్చు. దీని వల్ల ఒకే సమయంలో ఒక ఖాతాలో వ్యక్తిగత సంభాషణలు చేయవచ్చు. మరో ఖాతా వృత్తి, ఉద్యోగ పరమైన సంభాషణలు జరపవచ్చు.