తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

WhatsApp Web: ఫొటో ఎడిటింగ్.. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో కొత్త టూల్!

వెబ్‌ వెర్షన్‌లోనూ ఫొటో ఎడిటింగ్‌ ఫీచర్‌ను వాట్సాప్​ ప్రవేశపెట్టింది. 'డ్రాయింగ్ టూల్' పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్ వాట్సాప్‌ డెస్క్‌టాప్, వెబ్‌ వెర్షన్‌లో ఫొటోలను పంపే ముందుగా క్రాప్‌, రొటేషన్‌తోపాటు ఎమోజీ, టెక్ట్స్‌ యాడ్ చేసుకోవచ్చని తెలిపింది.

photo editing tool whatsapp
WhatsApp Web: ఫొటో ఎడిటింగ్.. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో కొత్త టూల్!

By

Published : Aug 11, 2021, 6:13 PM IST

వాట్సాప్‌ యాప్‌ ద్వారా మనం ఇతరులకు పంపే ఫొటోలను యాప్‌లోనే ఎడిట్‌ చేసుకునే వీలుంటుంది. కానీ డెస్క్‌టాప్‌, వెబ్‌ వెర్షన్‌లో మాత్రం ఈ ఫీచర్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఫొటోను ప్రత్యేకంగా ఎడిట్‌ చేసి షేర్ చేయాల్సిందే. ఇకమీదట అలాంటి అవసరం లేకుండా ఫొటో ఎడిటింగ్‌ ఫీచర్‌ను డెస్క్‌టాప్, వెబ్‌ వెర్షన్‌లోనూ (WhatsApp Web) పరిచయం చేసింది. గతంలో ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉండేది. 'డ్రాయింగ్ టూల్' పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్స్ వాట్సాప్‌ డెస్క్‌టాప్, వెబ్‌ వెర్షన్‌లో ఫొటోలను పంపే ముందుగా క్రాప్‌, రొటేషన్‌తోపాటు ఎమోజీ, టెక్ట్స్‌ యాడ్ చేసుకోవచ్చని తెలిపింది.

వెబ్‌ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన ఫొటో ఎడిటింగ్‌ ఫీచర్‌

మనం పంపాలనుకుంటున్న ఫొటోని ఛాట్‌ పేజ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత డ్రాయింగ్‌ టూల్ పేజ్‌ పైభాగంలో కనిపిస్తుంది. అందులో మనకి ఎమోజీ, స్టిక్కర్‌, టెక్ట్స్‌, డ్రాయింగ్, క్రాప్‌, రొటేషన్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని మీరు పంపుతున్న ఫొటోపై యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ పలువురు యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. కొద్ది రోజుల్లో యూజర్స్‌ అందరికీ పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ 2.21.16.10 పేరుతో ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కి కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇందులో 217 రకాల కొత్త ఎమోజీలను తీసుకొస్తున్నారు. వీటి సాయంతో యూజర్స్‌ తమలోని భావాలను మరింత మెరుగ్గా వ్యక్తపరచవచ్చని వాట్సాప్ పేర్కొంది. ఒకవేళ మీరు వాట్సాప్ బీటా యూజర్‌ అయితే గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి కొత్త అప్‌డేట్‌ను పొందొచ్చు. ఇటీవలే వ్యూ వన్స్‌ పేరుతో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇవేకాకుండా మల్టీపుల్‌ డివైజ్ సపోర్ట్, ఆర్క్వైడ్‌ మెసేజెస్, క్లౌడ్ బ్యాకప్, లోకల్ బ్యాకప్‌ వంటి కొత్త ఫీచర్స్‌ను త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది.

ఇదీ చదవండి :టెలిగ్రామ్​లో ఈ చిట్కాలు పాటించండి!

ABOUT THE AUTHOR

...view details