ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనివారు దాదాపు ఉండరనే చెప్పాలి. సామాజిక మాధ్యమాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు ఉంటున్నాయి. అయితే వీటిల్లో కొంతమంది ఒక్కోసారి మనకు మెసేజ్‌లు పంపి వాటిని వెంటనే డిలీట్ చేస్తుంటారు. ఈ ఫీచర్‌ను కొద్దికాలం క్రితం తీసుకొచ్చింది వాట్సాప్. అది కూడా 60 నిమిషాలలోపు పంపిన మెసేజ్‌లనే డిలీట్ చేయొచ్చు. అయితే డిలీట్ చేసినప్పటికీ ఆ మెసేజ్‌లో ఏముందనేది మనం తెలుసుకోవచ్చు. అదేలాగో చూడండి.
డబ్ల్యూఏఎమ్ఆర్: రికవర్ డిలీటెడ్ మెసేజెస్ అండ్ స్టేటస్ డౌన్లోడ్..
మనం చదవడానికి ముందే డిలీట్ చేసిన మెసేజ్‌లను డబ్ల్యూఏఎమ్ఆర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్లనూ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం.
ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి డబ్ల్యూఏఎమ్ఆర్ అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసి.. సంబంధిత సెటప్‌లను యాక్సెప్ట్ చేయాలి. ఏ యాప్‌ల నుంచి మీరు డిలీట్ చేసిన సమాచారాన్ని పొందాలనుకుంటున్నారో వాటిని క్యాప్చర్ నోటిఫికేషన్‌ను యాక్సెప్ట్ చేయడం ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల నుంచి మీరు డిలీట్ అయిన సమాచారాన్ని పొందాలనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డబ్ల్యూఏఎమ్ఆర్ యాప్‌లో వాట్సాప్‌తో పాటు మీరు ఎంపిక చేసిన అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. డిలీట్ అయిన మెసేజ్‌లు, స్టేటస్లు అటోమేటిక్‌గా డౌన్లోడ్ చేయడం వీటన్నింటికీ కూడా మనకు నోటిఫికేషన్లు చూపిస్తుంది.
వాట్సాప్, వాట్సాప్ డిలీటెడ్ మెసేజెస్, రీడ్ డిలీటెడ్ మెసేజెస్.. ఇలా ప్రతి అంశం డబ్ల్యూఏఎమ్ఆర్లో కనిపిస్తుంది. దీన్ని ఒకసారి యాక్సెప్ట్ చేశాక సంబంధిత నోటిఫికేషన్లు అన్ని డిస్ప్లేపై వాట్సాప్ నోటిఫికేషన్ల రూపంలోనే కనిపిస్తాయి. మీకు కావాల్సిన మీడియా ఫైల్స్, స్టేటస్ డౌన్‌లోడ్‌ను ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అందుకు కూడా ఆప్షన్ ఉంటుంది. వీటన్నింటికి ఒక్కసారి పర్మిషన్ ఇచ్చాక డబ్ల్యూఏఎమ్ఆర్ వాట్సాప్ మెసేజ్‌లపై ఓ కన్నేసి ఉంచుతుంది. ఈ డబ్ల్యూఏఎమ్ఆర్ అప్లికేషన్ వాట్సాప్, ఫేస్బుక్..యాప్‌లకు సమాంతరంగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి:టైప్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్.. ఇలా పంపండి