WhatsApp Hidden Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది. వాటిలోని టాప్-5 హిడెన్ ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. WhatsApp Video Call Screen Sharing Feature :వాట్సాప్‌లో వీడియో కాల్ చేసేటప్పుడు, స్క్రీన్ దిగువ భాగంలో 'Share' ఐకాన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే స్క్రీన్ షేరింగ్ యాక్సెస్ పర్మిషన్స్ అడుగుతుంది. మీరు దానిని కూడా ఓకే చేస్తే, వెంటనే మీరు ఎవరెవరికి స్క్రీన్ చేయాలనుకుంటున్నారో, వారందిరికీ లైవ్‌లో మీ స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ షేరింగ్ ఫర్ వీడియో కాల్స్ ఫీచర్, ల్యాండ్ స్కేప్ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. దీని వల్ల వాట్సాప్ యాప్‌ను డెస్క్‌టాప్‌లో ఉపయోగించినప్పుడు, మంచి వ్యూయర్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఈ వాట్సాప్ ఫీచర్‌ను గ్రూప్ కాల్స్‌లోనూ ఉపయోగించవచ్చు. అందువల్ల ఇకపై ఆఫీషియల్ మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ మీట్, జూమ్ లాంటి యాప్స్ వాడాల్సిన అవసరం ఉండదు.
2. WhatsApp Short Video Message Feature :ఈ షార్ట్ వీడియో ఫీచర్ అనేది రియల్‌టైమ్ వాయిస్ మెసేజ్ ఫీచర్లానే పనిచేస్తుంది. టెక్ట్స్ బాక్స్ పక్కనే వీడియో రికార్డింగ్ ఐకాన్ ఉంటుంది. దీనిని ఉపయోగించి 60 సెకెన్ల నిడివితో వీడియో మెసేజ్‌ను రికార్డ్ చేసి, తరువాత వాటిని మెసేజ్ రూపంలో ఇతరులకు పంపించవచ్చు.
3. WhatsApp One Time Voice Message Feature :వాట్సాప్‌లో మీరు పంపాలనుకున్న సున్నితమైన సమాచారాన్ని వన్-టైమ్ లిజన్ వాయిస్ మెసేజ్ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో ఎటువంటి భయం లేకుండా పంపుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ ద్వారా మీరు పంపే వాయిస్ సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్ లేదా షేర్ చేయడం, సేవ్ చేసుకోవడం, స్టార్ చేయడం, రికార్డ్ చేయడం కుదరదు. తద్వారా ఈ పైవాటిలో దేని ద్వారా కూడా మీరు భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడదు.