తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Whatsapp Email Login : వాట్సాప్​లో కొత్త రూల్.. ఇకపై ఈమెయిల్​తో లాగిన్​! - వాట్సాప్​ నయా అప్డేట్

Whatsapp Email Verification : ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​ మరో కీలక అప్డేట్​తో యూజర్స్​ ముందుకు రానుంది. అకౌంట్​ వెరిఫికేషన్​ కోసం ఈ-మెయిల్​ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారుల ప్రైవసీని కాపాడటమే లక్ష్యంగా వాట్సాప్​ ఈ మార్పును తీసుకువస్తున్నట్లు ఓ ప్రముఖ వెబ్​సైట్​ తెలిపింది.

Whatsapp Email Verification
వాట్సాప్​లో మరో కీలక అప్డేట్​.. అకౌంట్​ వెరిఫికేషన్ కోసం అది తప్పనిసరి..?

By

Published : Aug 4, 2023, 6:30 PM IST

Whatsapp Email Verification Code : ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్​ల​తో తమ వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​. తాజాగా యూజర్​ అకౌంట్​ వెరిఫికేషన్​ కోసం ఈ-మెయిల్​ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. హ్యాకర్లబారి నుంచి వినియోగదారుల గోప్యతను కాపాడటమే లక్ష్యంగా వాట్సాప్ ఈ కీలక మార్పు తీసుకువస్తున్నట్లు Wabetainfo వెబ్​సైట్​ వెల్లడించింది.

అనేక మార్పులతో..
Whatsapp New Features : ఇప్పటికే యూజర్స్​ సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఎండ్​-టు-ఎండ్​ ఎన్క్రిప్షన్​ ఫీచర్​​ వాట్సాప్​లో అందుబాటులో ఉంది. ఇదే కాకుండా ఇటీవలీ కాలంలో సెక్యురిటీ పరంగా సైలెన్స్​ అన్​నోన్​ కాలర్స్​, చాట్​ లాక్​ వంటి అనేక మార్పులు తీసుకువచ్చింది. కాగా, ఇన్ని మార్పులు చేస్తూ వస్తున్న వాట్సాప్​ను మాత్రం హ్యాకర్లు ఏదో విధంగా హ్యాక్​ చేస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్​తో తమ డెవలెప్​మెంట్​ టీమ్​ను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తుంది మెటా సంస్థ.

త్వరలోనే అందుబాటులోకి..
Whatsapp Login Email : ఇక సెక్యురిటీ డెవలెప్​మెంట్​లో భాగంగా త్వరలో రానున్న నయా ఫీచర్​ ఏంటంటే.. ఒక యూజర్​ వాట్సాప్​ను యాక్సెస్​ లేదా అకౌంట్​ను వెరిఫై చేయాలంటే ఈ-మెయిల్​ ఐడీని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపైనే పనిచేస్తుంది వాట్సాప్. అయితే యూజర్​ను ధ్రువీకరించడానికి తేనున్న ఈ ఈ-మెయిల్​ వెరిఫికేషన్​ ఆప్షన్​ను యాప్​లో ఆప్షనల్​గా చేర్చనున్నారని Wabetainfo తెలిపింది. ఈ-మెయిల్​ వెరిఫికేషన్​ ఆప్షన్​ను ఎనేబుల్​ చేసుకుంటే మీ ఖాతా వెరిఫై కోసం తప్పనిసరిగా మెయిల్​ను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. ఆఫ్​లో పెట్టుకుంటే మెయిల్​ లేకుండానే లాగిన్​ అవ్వచ్చు. కాగా, ప్రస్తుతానికి ఈ ఫీచర్​ అభివృద్ధి దశలోనే ఉంది. యాప్​కి సంబంధించి ఫ్యూచర్​ అప్డేట్స్​లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Latest WhatsApp Feature : వాట్సాప్​ యూజర్స్​ ఇక నుంచి తమ సందేశాలను షార్ట్ వీడియో రూపంలో కూడా ఇతరులకు పంపవచ్చు. ఇప్పటి వరకు కేవలం టెక్ట్స్​ రూపంలో మాత్రమే మెసేజ్​లు పంపించే సౌకర్యం ఉండగా.. ఇకపై 60 సెకెన్ల నిడివితో షార్ట్ వీడియో రూపంలోనూ మెసేజ్​లు పంపించేందుకు అవకాశం ఉంటుంది. ఈ వార్త పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details