Whatsapp Message Edit: వాట్సాప్‌లో మెసేజ్ పంపేటప్పుడు అక్షర దోషాలు, టైపోలు జరుగుతుంటాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మందికి ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎడిట్ మెసేజ్ ఫీచర్ కావాలంటూ చాలా కాలంగా యూజర్లు వాట్సాప్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ కూడా మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.
తాజాగా ఈ ఫీచర్‌లో మరో కీలక అప్‌డేట్ చేయనుంది. గతంలో ప్రకటించిన విధంగా మెసేజ్‌ను ఎడిట్ చేస్తే అవతలి వారికి తెలియదు. కొత్త అప్‌డేట్ ప్రకారం మెసేజ్‌ను ఎడిట్ చేస్తే ఎడిటెడ్ అనే లేబుల్ మెసేజ్ పక్కనే కనిపిస్తుంది. దానితోపాటు మెసేజ్ ఎడిటింగ్ టైమ్ లిమిట్ ఉంటుందని సమాచారం. ఎంత టైమ్‌లోపు ఎడిట్ చేయొచ్చు అనే దానిపై స్పష్టతలేదు.