తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

WhatsApp: వాట్సాప్‌తో పోటీనా.. వండర్ జరగాల్సిందే!

మెసేజింగ్​ యాప్ వాట్సాప్​ ప్రైవసీ పాలసీ(WhatsApp Privacy Policy) కారణంగా.. టెలిగ్రామ్, సిగ్నల్​ యాప్​ల డౌన్​లోడ్​లు భారీగా పెరిగాయి. అయితే.. సిగ్నల్ డౌన్​లోడ్స్​ బాగా పెరగడానికి కారణం ఎలన్​ మస్క్​ అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ వాట్సాప్​ హవా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ నంబర్​ వన్​ స్థానంలోనే ​ కొనసాగుతుండటం గమనార్హం.

WhatsApp
వాట్సాప్

By

Published : Sep 5, 2021, 9:33 AM IST

మెసేజింగ్‌ యాప్‌లలో అగ్రస్థానం వాట్సాప్‌దే. అయితే ఇటీవల టెలిగ్రామ్‌(WhatsApp vs Telegram), సిగ్నల్‌ యాప్‌ల(WhatsApp vs Signal) వాడకం బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా సిగ్నల్‌ డౌన్‌లోడ్స్‌ బాగా పెరగడానికి ప్రధాన కారణం ఎలన్‌ మస్క్‌ అని చెప్పుకోవచ్చు. సోషల్‌ మీడియాపై ప్రభావం చూపేవారిలో ఆయన ఒకరు. దేనిమీదైనా ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు.. ఎఫెక్ట్‌ ఎంతో తీవ్రంగా ఉంటుంది. కొన్నాళ్ల కిందట మెసేజింగ్‌ యాప్‌లకు సంబంధించి ఎలన్‌ మస్క్‌ ఓ ట్వీట్‌ చేశారు. తాను 'సిగ్నల్‌' యాప్‌ను వాడుతున్నానని, యూజర్లంతా వాట్సాప్‌ నుంచి మారిపోవాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా సిగ్నల్‌ యాప్‌(Signal App Download) డౌన్‌లోడ్‌లు పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యధిక ప్రైవసీ కలిగిన యాప్‌గా సిగ్నల్‌కు పేరుంది.

సిగ్నల్‌ తర్వాత టెలిగ్రామ్‌ ఉండగా.. ఆఖరి వరుసలో వాట్సాప్‌ ఉంటుంది. అయినా వాట్సాప్ హవా మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ మెసేజింగ్‌ యాప్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ప్రైవసీ పాలసీకి(WhatsApp Privacy Policy) సంబంధించి వాట్సాప్‌పై వివాదం చెలరేగింది. అదనపు రెవెన్యూ కోసం యూజర్ల డేటాను థర్డ్‌ పార్టీ కంపెనీలతో షేర్‌ చేసుకుంటుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ వాట్సాప్‌ కొట్టేసింది. బిజినెస్‌ ఫీచర్స్‌ను మరింత మెరుగ్గా యూజర్లకు అందించేందుకు ఫేస్‌బుక్‌తో డేటా షేర్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ డేటా షేరింగ్‌కు సంబంధించిన ఎలాంటి మార్పులూ చేయలేదని తెలిపింది. ఈ క్రమంలో సిగ్నల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌లు పెరిగినప్పటికీ వాట్సాప్‌ వినియోగం మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

వాట్సాప్‌ హవా తగ్గకపోవడానికి గల కారణాలు..?

ఇటీవలే టెలిగ్రామ్‌ యాప్‌ ఒక బిలియన్‌ (100 కోట్లు) డౌన్‌లోడ్‌ జాబితాలోకి చేరిపోయింది. అదే విధంగా సిగ్నల్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ కూడా 10 కోట్లు దాటేశాయి. అయితే ఎప్పటి నుంచో సేవలు అందిస్తోన్న మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ 6 బిలియన్‌ (600 కోట్లు) మార్క్‌ను అందుకోవడం విశేషం. మరి వాట్సాప్‌ను అందుకోవాలంటే 'సిగ్నల్‌', 'టెలిగ్రామ్‌' ఏదొక అద్భుతం చేయాల్సిందే.

మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ అగ్రస్థానం నిలుపుకోవడానికి ప్రధాన కారణం.. బ్రాండ్‌. అవును ఎవరికైనా సందేశం పంపించాలంటే ఠక్కున గుర్తుకొచ్చేది వాట్సాప్‌. ఎన్ని వివాదాలు చుట్టిముట్టినా వాటన్నింటినీ దాటుకుని యూజర్ల మనసును గెలుచుకోగలిగింది.

ఫేస్‌బుక్‌ చేతికి వచ్చాక ఇంకా వేగంగా తన పనితీరును మెరుగుపరుచుకుంటూ దూసుకెళ్తోంది. ప్రతి వారం కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తూ ఉండటం కూడా మరొక ప్రధాన కారణం. వివాదస్పదమైన కొత్త ప్రైవసీ పాలసీపైనా వాట్సాప్‌(Whatsapp Privacy Update) వివరణ ఇచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్‌ చేసే యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. వ్యక్తిగత చాట్స్‌, కాల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (ఈ2ఈ) ఉండటం వల్ల ఆ వివరాలను తాము కూడా చూడలేమని వెల్లడించింది. దీంతో యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తూనే సిగ్నల్‌, టెలిగ్రామ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాట్సాప్‌ను వదులుకోకుండానే మిగతా రెండు యాప్‌లను యూజర్లు వాడుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:WhatsApp Updates:వాట్సాప్​లో ఫేస్​బుక్ తరహా కొత్త ఫీచర్​

ABOUT THE AUTHOR

...view details