ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తూ.. యూజర్లకు వాటిని అందుబాటులోకి తెస్తోంది. ఇదే క్రమంలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 'కెప్ట్' అనే సరికొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా డిసప్పియరింగ్ మెసేజెస్ను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్డేట్ బీటా యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు.
వాట్సాప్ యూజర్స్ కొందరు డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంటారు. అందులో 24 గంటల్లో, 7 రోజుల్లో, 90 రోజుల్లో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా వాట్సాప్‌లో వారు పంపిన మెసేజెస్ వాటంతట అవే అదృశ్యం అయ్యేలా చేసి వారి వ్యక్తిగత గోప్యతను కాపాడుకుంటారు.