తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

WhatsApp Channel Creation : వాట్సాప్​ ఛానల్​ క్రియేట్ చేయాలా?... ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

WhatsApp Channel Creation : ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​ మరో అదిరిపోయే అప్డేట్​​తో వినియోగదారుల ముందుకు వచ్చింది. అది కూడా అందరూ నచ్చే, మెచ్చే సరికొత్త ఫీచర్​తో యూజర్స్​ను ఖుషి చేసేందుకు రెడీ అయింది. అదే వాట్సాప్​ ఛానల్​ క్రియేషన్​. మరి దీనిని ఎవరు క్రియేట్​ చేసుకోవచ్చు? ఎలా క్రియేట్​ చేసుకోవాలి? మొదలైన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

How To Create Whatsapp Channel
Whatsapp Channel Creation Guide In Telugu

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 2:10 PM IST

WhatsApp Channel Creation :మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ చాటింగ్​ యాప్​ వాట్సాప్.. వావ్​ అనిపించే అప్డేట్​తో మరోసారి యూజర్స్​ ముందుకు వచ్చింది. అదే వాట్సాప్ ఛానల్​ క్రియేషన్​. దీనితో ఇక నుంచి వాట్సాప్ యూజర్లు.. తమ సొంత వాట్సాప్​ ఛానల్​ను క్రియేట్​ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్​ను కేవలం ప్రముఖులకు, సెలబ్రిటీలకు మాత్రమే అందిబాటులోకి తెచ్చారు. అయితే త్వరలోనే దీనిని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెస్తామని వాట్సాప్​ తెలిపింది. మరి వాట్సాప్​ ఛానల్​ను ఎలా క్రియేట్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా?

ఫోన్​లో వాట్సాప్​ ఛానల్​ ఎలా?
How To Create WhatsApp Business Channel :

  • మీ ఫోన్​లో వాట్సాప్​ను ఓపెన్​ చేసి 'Updates Tab'పై క్లిక్​ చేయాలి.
  • అక్కడ మీకు (+) ఐకాన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయండి.
  • తర్వాత "New Channel"పై ట్యాప్ చేయాలి.
  • అనంతరం ఆన్​స్క్రీన్​ ఇన్​స్ట్రక్షన్స్​ను ఫాలో అవుతూ 'Get Started'పై క్లిక్​ చేయాలి.
  • క్రియేట్​ చేసిన ఛానల్​కు ఒక పేరు ఇవ్వాలి.
  • ఇక్కడ మీ ఛానల్​కు మీకు నచ్చిన డిస్క్రిప్షన్​, ఐకాన్​ లేదా ప్రొఫైల్​ పిక్​ను యాడ్​ చేసుకునే వీలుంది.
  • దీని తర్వాత 'Create Channel'ను సెలెక్ట్​ చేసుకోవాలి. అంతే మీ ఛానల్​ రెడీ.

పీసిలో వాట్సాప్​ ఛానల్​ క్రియేట్​ ఇలా!

  • ముందుగా మీ పీసీలోని వాట్సాప్​ వెబ్​లోకి లాగిన్​ అవ్వాలి.
  • అక్కడ 'Channels' ఐకాన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత "Create Channel"ను సెలెక్ట్​ చేసి "Continue"పై ట్యాప్​ చేయాలి.
  • అనంతరం అప్లికేషన్​ అడిగే ఆన్​స్క్రీన్​ ఇన్​స్ట్రక్షన్స్​ ఫాలో అవ్వాలి.
  • పూర్తిగా ఛానల్​ క్రియేట్​ అవ్వడానికి మీ ఛానల్​కు ఓ పేరును ఇవ్వాలి. దీనిని మీరు ఆ తర్వాత కూడా మార్చుకోవచ్చు.
  • ఇక్కడ మీ ఛానల్​ను కస్టమైజేషన్​ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అందువల్ల మీరు మీకు నచ్చిన డిస్క్రిప్షన్​ను, ఐకాన్​ను యాడ్​ చేసుకోవచ్చు. లేదా స్కిప్​ చేసి తర్వాత కూడా వాటిని యాడ్ చేయవచ్చు.
  • అయితే ఛానల్​ డిస్క్రిప్షన్​లో మీరు ఛానల్ ఎందుకు పెట్టారు? దాని ఉద్దేశం ఏమిటి? మొదలైన వివరాలను సవివరంగా తెలియజేస్తే మంచిది. దీనితో మిమ్మల్ని అనుసరించే ఫాలోవర్స్​​కు మీ ఛానల్​ మోటో ఏమిటో సులువుగా తెలుస్తుంది.
  • అలాగే మీ ఛానల్​కు ఓ లోగోను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఏదైనా మంచి ఫొటోను మీ గ్యాలరీ లేదా వెబ్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోని లోగో పెట్టుకోవచ్చు.
  • చివరగా "Create Channel"పై క్లిక్​ చేయాలి. అంతే ల్యాప్​టాప్​ లేదా పీసీలో మీ ఛానల్​ రెడీ.

భారత్​ సహా 150 దేశాల్లో!
WhatsApp New Update Channel :మెటా కంపెనీ భారత్​ సహా 150కిపైగా దేశాల్లో​ ఈ 'వాట్సాప్​ ఛానల్స్'​ ఫీచర్​ను లాంఛ్​ చేసింది. అయితే ప్రస్తుతం ఈ అప్​డేట్​​ కేవలం కొందరు బీటా టెస్టర్లు, సెలబ్రిటీలకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. మిగతా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్, వారు చేసే కామెంట్స కనబడుతూ ఉంటాయి. కానీ వాట్సాప్​ ఛానల్​కు సంబంధించిన ఫాలోవర్స్​ వ్యక్తిగత వివరాలు లేదా వారు చేసే కామెంట్లు ఇతర ఫాలోవర్లకు కనబడవు.

అప్పుడే ఛానల్స్​ షురూ!
ఈ వాట్సాప్​ ఛానల్​ క్రియేషన్​ ఫీచర్​ను ప్రస్తుతానికి కేవలం ప్రముఖులు, కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్​ నటీనటులు కత్రినా కైఫ్​, దిల్​జిత్ దొసాంజ్​, అక్షయ్​ కుమార్​, నేహా కక్కర్​ సహా తెలుగు హీరో విజయ్​ దేవరకొండ ఇప్పటికే తమ సొంత వాట్సాప్​ ఛానల్స్​​ను క్రియేట్​ చేసుకున్నారు.

ఛానల్​ ద్వారా క్రికెట్​ అప్డేట్స్​!
వాట్సాప్​ ఛానల్​ ఫీచర్ విషయంలో వాట్సాప్​తో కలిసి పనిచేసేందుకు (భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి కనబరుస్తోంది. అక్టోబర్​లో ప్రారంభంకానున్న ICC పురుషుల క్రికెట్​ వరల్డ్​ కప్​ 2023 కోసం ఛానల్​ను క్రియేట్​ చేసేందుకు మేము ఇప్పటికే మెటాతో చర్చలు జరిపామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇద్దరి భాగస్వామ్యంతో క్రికెట్​ అప్డేట్స్​ సహా ఇతర ముఖ్యమైన వివరాలను ఎప్పటికప్పుడు యూజర్స్​కు తెలియజేస్తామని భారత క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details