యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు.. సెప్టెంబర్‌లో 76,967 పోస్ట్‌లు/ఆర్టికల్స్‌ను.. తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు (watsapp content analysis) సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. దీనితోపాటు.. ఆటోమెటిక్ డెటెక్షన్ ద్వారా 4,50,246 అభ్యంతరకర అంశాలను తొలగించినట్లు నెలవారీ 'ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్'లో పేర్కొంది.
మే 26 నుంచి అమలులోకి వచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా.. ఈ చర్యలకు ఉపక్రమించినట్లు (google complaints team) గూగుల్ స్పష్టం చేసింది. వ్యక్తిగత యూజర్ల నుంచి.. సెప్టెంబర్‌లో 29,842 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించిన కంటెంట్‌లో కాపీరైట్ (76,444), ట్రేడ్‌మార్క్ (493), ఇతర చట్టపరమైన (11), పరువు నష్టం (2), గ్రాఫిక్ అశ్లీల కంటెంట్ (11) కేటగిరీలు ఉన్నట్లు తెలిపింది గూగుల్.
మెటా..
నూతన ఐటీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నెలకు 2.69 కోట్ల కంటెంట్‌పై ఫేస్బుక్ చర్యలు (facebook action report) తీసుకుంది. ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో యూజర్ల నుంచి 708 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తెలిపింది. అందులో 589 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించింది.