తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

స్పేస్ టూర్ సక్సెస్​లో అదే కీలకం! - సబ్​ఆర్బిటల్​

రిచర్డ్​ బ్రాన్సన్, జెఫ్​ బెజోస్​​ రోదసి యాత్రల విజయం 'సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్​'పైనే ఆధారపడి ఉందని ఏరోస్పేస్​ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. అసలు సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్​ అంటే ఏంటి? అది ఎందుకు అంత కీలకం?

suborbital
సబ్​ఆర్బిటల్​

By

Published : Jul 11, 2021, 4:32 PM IST

రిచర్డ్​ బ్రాన్సన్​ రోదసి ప్రయాణానికి యావత్​ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కొద్ది గంటల్లో వర్జిన్​ గెలాక్టిక్​ రూపొందించిన ప్రత్యేక విమానంలో రిచర్డ్​ తన బృందంతో నింగిలోకి ఎగరనున్నారు. ఆయన​ కల నెరవేరితే.. ప్రైవేటు రంగంలో తొలిసారి అంతరిక్షంలోకి ప్రవేశించిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టిస్తారు.

అమెజాన్​ బాస్​ జెఫ్​ బెజోస్​ కూడా త్వరలో అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. అయితే వీరి సక్సెస్ అంతా ఒకేదానిపై ఆధారపడి ఉంది ఏరోస్పేస్​ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. అదే "సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్​."

ఏంటీ సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్​?

రిచ్​, బెజోస్​.. భూవాతావరణం- రోదసి సరిహద్దు వరకే వెళతారు. ఆ తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండేందుకు కావాల్సిన వేగం వీరి ఫ్లైట్లకు ఉండదు. దీనినే సబ్​ఆర్బిటల్​ అంటారు.

స్పేస్​క్రాఫ్ట్​ లేదా మరే ఇతర వస్తువైనా గంటకు 28వేల కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ వేగాన్ని అందుకుంటే.. అది భూమి మీద తిరిగి పడిపోకుండా, భూమి చుట్టూ తిరుగుతుంది. దీనినే భూ కక్ష్యగా అభివర్ణిస్తారు. చంద్రుడు, ఉపగ్రహాలు ఇదే సిద్ధాంతంతో భూమిపైన ఉండి, గ్రహం చుట్టూ తిరుగుతాయి.

ఎందుకు ఇంత కీలకం?

రిచ్​, బెజోస్​ ఫ్లైట్లు.. భూ కక్ష్యకు చేరవు. అయినప్పటికీ వీరు చరిత్ర సృష్టించినట్టే. అయితే ఈ సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్లు రోదసిలో కొంతసేపు ఉంటాయి. ఆ సమయంలో అందులోని వారు భారరహిత స్థితికి లోనవుతారు.

క్రికెట్​ బాల్​​ లాగే!

ఉదాహరణకు ఓ క్రికెట్​ బాల్​ తీసుకుందాం. ఆ ​బాల్​ను పైకి ఎంత బలంగా వేస్తే, అంత పైకి వెళుతుంది. అంత ఎక్కువ సేపు గాలిలో ఉంటుంది. అదే బంతిని కొంచెం పక్కకు వేస్తే, అంతే వేగంగా వెళుతుంది కానీ మునుపటితో పోల్చుకుంటే తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తుంది.

ఖాళీ ప్రదేశంలో బంతిని విసిరితే.. పైకి వెళ్లేకొద్దీ బంతి వేగం తగ్గిపోతుంది. ఎత్తు కారణంగా అప్పటివరకు ఉన్న గతి శక్తి, స్థితి శక్తిగా మారుతుంది. చివరకు వేగానికి సరిపడా ఎత్తుకు ఎగిరి కిందపడిపోతుంది.

అదే బంతిని 60మైళ్లు పైకి విసిరితే.. అది కూడా రోదసిలోకి ప్రవేశించినట్టే! కానీ గరిష్ఠ ఎత్తును అందుకున్న తర్వాత అది భూమిపై తిరిగి పడిపోతుంది.

అలా గరిష్ఠ ఎత్తుకు వెళ్లి, తిరిగి కింద పడిపోయే మధ్యలో ఉన్న సమయంలో ఆ బంతి​ భారరహిత స్థితికి గురవుతుంది. స్పేస్​క్రాఫ్ట్​​లోని వ్యోమగాముల పరిస్థితి కూడా ఇంతే. వారూ భారరహిత స్థితికి లోనవుతారు. ఇలా వారు రోదసిలోకి వెళ్లినట్టే ఉంటుంది కానీ భూ కక్ష్యలోకి ప్రవేశించరు. దీనినే సబ్​ఆర్బిటల్​ ఫ్లైట్​ అంటారు.

ఇదీ చూడండి:-'రిచ్'​ రోదసి ప్రయాణం సాగనుంది ఇలా..

ABOUT THE AUTHOR

...view details