అంతర్జాలంలో వీడియోలు చూసే సమయం గతేడాదితో పోల్చితే ఈ జులైలో 45శాతం పెరిగినట్లు 'యూట్యూబ్' తెలిపింది. చవకగా ఉన్న డేటా ధరలు, తక్కువ మొత్తంలో అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లతో పాటు ప్రాంతీయ భాషల్లో వీడియోలు లభ్యమవుతున్న కారణంగా చూసే సమయంలో భారీగా మార్పు వచ్చినట్లు పేర్కొంది.
అంతేగాక దేశంలోని ఆరుభాషల్లో అధికంగా ప్రకటనలు వస్తున్నట్లు తెలిపింది యూట్యూబ్. ఈ ఏడాదిలో యూట్యూబ్ తన మొట్టమొదటి ప్రాంతీయ భాషా ప్రకటనల లీడర్‌బోర్డ్‌ను ఆవిష్కరించింది. దీంతో 2020 ద్వితీయార్థంలో టాప్ టెన్‌లో ఉండే ప్రకటనలను పొందగిలినట్లు వెల్లడించింది.
మరికొన్ని అంశాలు...
- అంతర్జాల వేదికగా వీడియోలు చూసే సమయం అంతకంతకూ పెరుగుతోంది.
- ప్రాంతీయ భాషల్లో వీడియోలు అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణం.
- సరసమైన ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ల లభ్యత, చౌక డేటా కారణంగా కొన్ని ఏళ్లుగా ఆన్లైన్లో వీడియోలు చూడడం భారీగా పెరిగింది.
- కరోనా లాక్డౌన్ కారణంగా దేశంలో ఆన్లైన్లో వీడియోలు చూడడం, సంగీతం వినడం ఎక్కువ అయ్యింది.
- ఓవర్-ది-టాప్(ఓటీటీ) సేవల వినియోగంలో మరింత మెరుగుదల కనిపించింది.
- యూట్యూబ్ వేదికగా 93శాతం మంది వీక్షకులు ప్రాంతీయ భాషల్లో వీడియోలు చూడటానికి ఇష్టపడుతున్నారు.