విండోస్ 11(Windows 11) ఆపరేటింగ్ సిస్టంను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) గురువారమే విడుదలచేసింది. విండోస్ 10 నుంచి విండోస్ 11కు ఉచితంగానే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు గల ఈ ఓఎస్‌ను మీరు అనుభూతి చెందాలంటే ఇంకొంత కాలం వేచిచూడక తప్పదు. అక్టోబరు లేదా నవంబరు వస్తే గానీ విండోస్ 11 అధికారికంగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
అదీకాక, విండోస్ 11 పొందాలంటే మీ సిస్టమ్‌లో ఈ కింది కాన్ఫిగరేషన్ ఉండాల్సిందేనని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
అవీ..
- 64-బిట్ సీపీయూ (కనీసం 2 కోర్స్‌తో)
- కనీసం 4జీబీ ర్యామ్
- కనీసం 64జీబీ రోమ్
- సీపీయూలో టీపీఎం 2.0, డైరెక్ట్ ఎక్స్ 12, టచ్‌ప్యాడ్ మొదలైనవి.